ఈ పుట ఆమోదించబడ్డది

218

వంశ పారంపర్యముగ ఈ వ్యాధి అంటు కొను ననుటకు కొన్ని హేతువులు కనిపించు చున్నను ఈ వాదము సరికాదని ఈ క్రింది నిదర్శనముల వలన తెలియ గలదు. నార్వే దేశమున నుండి నూట యిరువది మంది కుష్ఠరోగులు అమెరికా దేసమునకు పోయి అక్కడ విశాలమయిన స్థలములలో జన సమ్మర్దమును కల్మషమును లేని చోట్ల కాపురము ఉండిరి. వారి సంతానము నందు గాని మనుమల యందు గాని ఈ వ్యాధి బొత్తిగ అగుపడక పోవుట ఈ వాదమును ఖండించు చున్నది. ఇక సంపర్క వాదము. ఐర్లండు దేశమును ఎన్నడనును విడిచి యుండని ఒకానొకడు అమెరికా దేశమునకు పోయి కుష్ఠ వ్యాది నంటించుకొని వచ్చిన తన తమ్ముని పడక మీద కొన్ని దినములు పరుండిన కారణము చేత వానికీవ్యాధి అంటు కొనెను. కాబట్టి ఒక మానవుని నుండి మరియొక మానవునకు ఈ వ్యాధి అంటు కొనుననియు, అట్లంటు కొనుటకు అన్యోన్య సంపర్కము అవశ్యకమనియు తోచు చున్నది. ఇట్లధిక సంపర్కము గలిగి యుండుట చేతనే ఒక వంశము నందనేకులకు ఈ వ్యాధి వచ్చుచు వంశ పారంపర్యముగ వచ్చుచున్నట్లు తోచ వచ్చును.

కొన్ని దేశములలో ఈ వ్యాధి సముద్రపు ఒడ్డున మాత్రము వ్వాపించి యుండుట చేత చేపల మూలమున ఇది వచ్చునని కొందరు అభిప్రాయ పడి యుండిరి. కాని బొత్తిగ చేపలను తినని బ్రాహ్మణ కుటుంబములలో కూడ ఈ వ్యాధి వ్యాపించి