ఈ పుట ఆమోదించబడ్డది

వాహనము ఈగ

11


నూతుల దగ్గరను, వంటి యింటి ప్రక్కలను, కాళ్ళు చేతులు కడుగు కొను చోట్ల బురబుర లాడు చుండు చల్లని నేలందును, ఇచ్చ వచ్చినట్లు ఆడి ఆడి తుదకు ఒక గడప మీదనో కిటికీ మీదనో వ్రాలును. ఇది ఇక్కడ ఏమి చేయునో చూడుము. అక్కడక్కడ గంతులు వేయుటకు పోయినప్పుడు ఇది సోమరి పోతుల వలె ఆడుకొనుటకు అక్కడుకు పోలేదు. ఇది తిరిగిన అన్ని చోట్లనుండి రెక్కలమీదను తలమీదను పెట్టుకొని మోయ గలిగినంత బరువును మోసికొని వచ్చినది. తెచ్చిన దానిని తినుటకై ఇది యిక్కడ చేరినది. ఇది తీరికగా వ్రాలిన తరువాతి దీని నడవడి శోధించిన అంతయు తెలిసి పోవును. ఇది తన నాలుగు ముందు కాళ్ల మీదను వంగి నిలుచుండి వెనుక ప్రక్కనుండు రెండు కాళ్ళతో రెక్కలను వీపును అనేక సార్లు మిక్కిలి శ్రద్ధ్యతో తుడుచును. ఇట్లు తుడిచి తుడిచి దీని వీపు మేద మోసికొని వచ్చిన సరకుల నన్నిటిని వెనుక కాళ్ళతో నెత్తి, దానిని తన ఆరుకాళ్లతో త్రొక్కి ముద్ద చేసి ముందరి రెండు కాళ్ళతో నోటిలో పెట్టుకొని మ్రింగి వేయును. ఇట్లే వెనుక ప్రక్క కాళ్ళ మీద నిలువబడి ముందరి కాళ్ళతో తల, మెడ మొదలగు ప్రదేశముల మీదనున్న సామా నంతయు దింపి చిన్న చిన్న ఉండలుగా జేసికొని మ్రింగును. ఈ ఉండలు సూక్ష్మజీవుల ముద్దలుగాని వేరుగావు. ఇవియే దీని కాహారమని యెరుగని వారీ యీగ కాళ్ళు చేతుల నెందుకు ఆడిచుచునదో తెలికొన జాలరు.