ఈ పుట ఆమోదించబడ్డది

211

ఉమ్మివేయక గుడ్డలో వేసి దానిని ఎప్పటికప్పుడు కాల్చి వేయ వలెను. వీరు ఉపయోగించిన బట్టలను ఇతరులు ఉపయోగింప రాదు. వాయు ప్రసారము అధికముగ గల స్థలములలోను, ఎండయు వెలుగురు నిరంతరము ప్రసరించు స్థలములలోను ఈ వ్యాధి యొక్క వ్యాపకము మిక్కిలి తక్కువగ నుండును. కావున ప్రజలందరును వెలుతురు లేని ఇండ్లలో క్రిక్కిరిసి నివసింపక సాధ్యమయినంత వరకు గ్రామములను విస్తరించి కట్టుకొనుచు జన సమ్మర్దమును తగ్గించు కొనవలయును. తేమ నేలలును పల్లపు ప్రదేశములును ఈ వ్యాధికి ప్రీతి యగుట చేత సాధ్యమైనంత వరకు ప్రజలు ఎత్తుగ నుండు ప్రదేశములలో ఇండ్లు కట్టుకొనుటకు ప్రయత్నింప వలయును. ఇండ్లలోనికి సాధ్యమయినంత వెలుగురు వచ్చు నట్లు కిటికీలను మండువాలను ఖాళీస్థలములను ఉంచు కొనవలయును. క్షయ రోగులులకు మిట్ట ప్రదేశములలో ప్రత్యేకాశ్రమములను అనగా శానిటేరియన్ కట్టించి వారలను అక్కడ విశాలముగ నివసింప జేయ వలెను. ఆవు పాల మూలమునను మాంసాదుల మూలమునను ఈ వ్యాధి వ్యాపింప వచ్చును కావున ఏయాహారమును గాని చక్కగ ఉడకకుండ తినరాదు.

ప్లేగు (Plague)

ఈ వ్యాధిని కలిగించు సూక్ష్మ జీవి గాలిలో ఎగురుచు ఎంత చిన్న గాయము గుండా నైనను రక్తము లోనికి ప్రవేశింప వచ్చును. ఆహారము గుండ గాని ఊపిరి గాలి గుండ గాని ప్రవే