ఈ పుట ఆమోదించబడ్డది

204

మనిషి తానీ వ్యాధిని బొందకుండగనే ఒక రోగి నుండి మరియొకనికి అంటించ గలిగి నట్లు నిదర్శనములు గలవు. ఓడలలోని సామానుల మూలమున ఈ వ్యాధి యొక దేశమునుండి మరియొక దేసమునకు వ్వాపింప గలిగినట్లును నిదర్శనములు గలవు. ఋతువుగాని దేశము యొక్క సీతోష్ణస్థితి గాని నమ సమ్మర్థము గాని గాలి వెల్తురు మొదలగునవి కాని ఈ వ్యాధి యొక్క వ్యాపకముతో అంతా సంబంధము గలిగి యునట్లు తోచదు. క్రిక్కిరిసి యుండు పట్టణము లందెట్లో విశాలముగ నుండు నారామములయందట్లే ఈ జ్వరము వ్యాపించు చున్నది. మశూచకము, ఆటలమ్మ మొదలగు వ్యాధుల వ్యాపకమునకును దీని వ్యాపకమునకును గల బేధములలో ఇది ముఖ్యమైనది.

నివారించు పద్ధతులు

ఒక సారి వచ్చిన వానికి ఈ వ్యాధి తిరిగరాదని లేదు. బహుశః ఒక సారి దీని పాలనన బడిన వాడు అనేక సారులు బడునని తోచు చున్నది.

(1) ఇంటిలో నొకనికి వ్యాధి వచ్చిన వెంటనే రోగిని ప్రత్యేక పరచి రోగితో ఇతరుల సంపర్కము తగ్గించ వలెను.

(2) ఉమ్మి, చీమిడి, తెమడ మొదలగునవి ఇండ్లలో గాని పని యేయు స్థలములో గాని గోడల మీదను గుడ్డల మీదగాని పడి ఎండి పోనీయరాదు. సాధ్యమైనంత వరకు కాగితములలో గాని శుబ్రమైన పాత గుడ్డలలో గాని వీనిని చేర్చి తగుల బెట్ట