ఈ పుట ఆమోదించబడ్డది

10

రెండవ ప్రకరణము


వాహనము ఈగ

మనమొక అయిదు నిమిషములు ఒక ఈగ చేయుపనులను పరీక్షించి నేర్చుకొనగల విషయము లనేకములుగలవు. సామాన్యముగా నేకాలమునందును మన దేశములో ఈగలకు కొదువయుండదు. కానితాటిపండ్లు, ఆవుపేడ మురుగుచుండు వానకాలములో అవి మెండుగ నుండును. దీనికి అశుభ్రతయే కారణము. ఒక గ్రామముగాని, ఒక ఇల్లుగాని శుభ్రముగా నున్నదా యని తెలిసికొనవలెనన్న అక్కడనుండు ఈగల జనాభాను ఎత్తుకొనిన చాలును. ఈగలు ఎంత తక్కువగ నున్న అంత పరిశుభ్రత గలదని చెప్పవచ్చును. గ్రామములలోని భూములను కొలుచుటకు గజముబద్దలును, ధాన్యములను కొలుచుటకు కుంచములను ఉపయోగించుట యెట్లో అట్లే ఒక గ్రామముయొక్క అరోగ్య స్థితిని కొలుచుటకు ఈగను కొలత పాత్రగా ఉపయోగింప వచ్చును. ఈ విషయమై యింకను చక్కగ మనస్సులో నాటుకొనుటకై ఒక నిదర్శనము చెప్పెదము. ఒక ఈగను కొంచెము సేపు పరీక్షించి చూచునెడల ‘ఎందుకురా యిది పనిలేకుండ నిట్లు గంతులు వేయుచున్నది.’ అని అనిపించును. ఇదికొంతసేపు మన చేతి మీదను, కొంత సేపు పిల్లుల కుక్కలమీదను, పిల్లల గజ్జిపుండ్లమీదను, కొంత సేపు వంటయింటిలోని తడినేల మీదను, మరికొంతసేపు పేడ కుప్పలమీదను, కొంత సేపు క్రుళ్లుచుండు జల దారులమీదను,