ఈ పుట ఆమోదించబడ్డది

202

నివారించు పద్ధతులు

ఇది వ్వాపించు విధము కొంతవరకు మనకు తెలిసి యున్నది. కనుక ఆ మార్గములలో పడకుండ ప్రయత్నించుటయే గాక దీనిని నివారించు ముఖ్య పద్ధతి .... నివసించు ఇండ్లు శుభ్రముగ నుంచుట, పట్టణము శుభ్రముగ నుంచు కొనుట, శరీరమును శుభ్రముగ నుంచు కొనుట, న్యూమోనియా రోగుల కఫము నెప్పటి కప్పుడు శుద్ధి చేసి కొనుట, ఇవియే నివారించు పద్ధతులు. గాలి మూలమున వ్యాపించు వ్యాధుల కన్నిటిని అవలంబించ వలయును. న్యూమోనియా రాకుండ నివారించుటకు టీకా రసమును ఇప్పడిప్పుడు కనిపెట్టుచున్నారు. వీని యుపయోగమును గూర్చి ఇంకను నిశ్చయముగ జెప్పుటకు వీలు లేదు.

ఇన్‌ఫ్లూయింజా

మనకు తెలిసిన అంటు వ్యాధులలో ప్రపంచ మంతయు ఒక్కసారి ముట్టించునది ఇన్ ప్లూయింజా జ్వరమని చెప్పవచ్చును. ఈ జ్వరము తనంతట తాను మనుష్యులను చంపదు. కాని తన వలన కలిగిన బలహీత స్థితి యందు ఇతర వ్యాధులను గలిగించి రోగిని లొంగదీయును. ఇదియును డెంగ్యూ జ్వరము వలెనే అకస్మాత్తుగ వచ్చును కాని జ్వరము దానంత తీవ్రముగా నుండదు. ఇన్ ప్లూయింజా యందు దగ్గు, పడిశము, చలి, ఈ లక్షణము అధికముగా నుండును. డెంగ్యూ జ్వరము