ఈ పుట ఆమోదించబడ్డది

198

ఉన్నట్టును తెలియదు. ఇది ప్రపంచమునందన్ని భాగముల యందును ఒక్కటే రీతిని చిరకాలమునుండి వ్యాపించుయున్నట్లు తోచు చున్నది. ఈ వ్యాధి యొక్క వ్యాపకమునకు అన్ని కాలములు సమానమైనప్పటికిన్ని ఇది వర్షకాలమునందును చలికాలమునందును రోగులను ఎక్కువగా బాధించును. మగ పిల్లలలో కంటే ఆడపిల్లలలో ఈ వ్యాధి హెచ్చుగ వ్యాపించునని తోచు చున్నది. ఎక్కడనో వయసు వచ్చిన వార్లకు కూడ వచ్చినను దీని వ్యాపకము పిల్లలోనే తరుచు, పెద్ద పిల్లలో కంటె పాలు గ్రాగు పిల్లలకు తక్కువగా ఉండునని చెప్పుదురు. రెండు మొదలు అయిదు సంవత్సరముల వయస్సు వచ్చు వరకు దీని వ్వాపకము హెచ్చుగ నుండును. తల్లి కడుపులో నున్నపుడే తల్లి నుండి పిండము ఈ వ్యాధిని సంపాదించుకొని పుట్టిన కొద్ది గంటలలో ఈ యొక్క లక్షణములన్నియు చూపుచు వ్యాధినొందిన బిడ్డలలో నిదర్శనములు గలవు. పిల్లలలో వలెనే పెద్ద వార్లలో గూడ మగ వాండ్లలో కంటే ఆడ వాండ్రలో ఈ వ్యాధి హెచ్చు. అందు ముఖ్యముగా గర్భిణీ స్త్రీలనిది హెచ్చుగ అంటు చున్నట్టు కనబడు చున్నది. పొంగు, ఆటలమ్మ, మొదలగు అంటు వ్వాధులున్న సమయముల లోనే కోరింత దగ్గు కూడ తరచు వ్యాపించు చుండుటకు కారణమింత వరకు తెలియలేదు.

నివారించు పద్ధతులు

ఈ వ్వాధిని కలిగించు సూక్ష్మ జీవి ఇంతవరకు నిశ్చయముగా తెలియ లేదు. ఇతర అంటు వ్యాధులందు వలెనే కొంత