ఈ పుట ఆమోదించబడ్డది

188

ఒకచోట మశూచకము ఉన్నదని తెలిసిన వెంటనే అధికారులు రోగిని తగిన వైద్య శాలకు తీసికొని పోవలయును.

ఇల్లంతయు పదమూడవ ప్రకరణములో చెప్పి నట్లు శుద్ధి చేయ వలయును. రోగి యొక్క పరుపును, బట్టలను అవసరమైన యెడల నాశనము చేసి రోగికి తగిన పరిహార మియ్యవలయును.

చుట్టుపట్ల నున్న ప్రజల కందరకును టీకాలు వేయ వలయును. ఇతర గ్రామముల నుండి రోగిని చూడ వచ్చిన వారి విషయమై వెంటనే ఆయా గ్రామాధికారులకు తెలియ పరచి వారికిని వారి నంటి యుండు వారికిని టీకాలు వేయించ వలయును.

బడికి బోవు పిల్లలున్న యెడల తక్షణము వారిని నిలిపి ఆ బడిలోని పిల్లలందరుకును టీకాలు వేయ వలయును. ఆ సమయమున బడికి రాని పిల్లల పట్టీని తయారు చేసి వారి యిండ్లకు పోయి వారలకు ఇదివరకే అమ్మావారంటినదేమో తెలిసికొని వారలకును వారల నంటి యుండు వారలకును, అందరకును తిరిగి టీకాలు వేయ వలయును. ఆ యింటి నుండి మనుష్యులు నౌకరికి గాని, వ్యాపారములకు గాని ఏ ఏ స్థలములకు వెళ్ళుదురో చక్కగ కనిపెట్టి అచ్చటి వారల కందరకును తెలిపి తిరిగి టీకాలు వేయవలయును. రెండోవ సారి టీకాలు వేసికొనుట నిర్బందము గాదు కనుక, తిరిగి టీకాలు వేసికొనమని ఎవరైనను తిరుగ బడిన ఎడల అట్టి వారలను పదునాలుగు దినముల వరకు నౌకరికి రానీయ కుండ జేచి ప్రజలనుండి ప్రత్యేక పరచ