187
పోవుట చేతను, పెద్దలు తమతమ పనుల మీద ఊరంతయు దిరుగుట చేతను, తల్లులు ఒక క్షణమున రోగికి ఉపచారములు చేయుచు, మరిక క్షణమున నా బట్టలతోడనే చెరువునకు వెళ్ళి నీరు తెచ్చుట చేతను లేక దుకాణమున కూర్చుండి పండ్లు అమ్ముట చేతను, చాకలి వారు వీధి వెంట రోగి బట్టలను దీసికొని పోవుట చేతను, బంధుగులు రోగిని చూచుటకు వచ్చి పోవుచుండుట చేతను, ఈ వ్యాధి వ్యాపింప గలదు. దీని వ్యాపకమున కిన్ని మార్గములుండుట చేతనే ఒకానొకచో అదృష్ట వశమున ఒక్కనికే వ్యాధి వచ్చి పోవుటయు, మరొకచో ఒక్కని నుండి నూరుగురు వరకు కూడ వ్యాధి వ్యాపించుటయు సంభవించు చున్నది.
ఒకనికి అమ్మవారు సోకినదని అనుమానము కలిగిన వెంటనే ఆయింటి యందు పూచీగల వారెవ్వరో అధికారులకు తెలియ జేయవలయును. ఆ అధికారులు మిక్కిలి నేర్పును జాగరూతకయు గలవారై ఏయూరినుండి ఆమనిషి వచ్చినదియు, ఎవరెవరి ఇండ్లకు తిరిగినదియు, ఏ ఊరినుండి ఎవరెవరు ఆ యింటికి వచ్చుచు పోవు చున్నదియు చక్కగ కనిపెట్ట వలయును. వ్యాధి వచ్చిన వెంటనే తెలుపని వానికిని, తెలిసిన సమాచారమును గూడముగ నుంచిన వానికిని, అధికారులడినపుడు అబద్ధము చెప్పు వానికిని తగిన శిక్ష విధించుటకై శాసములుండవలెను.