ఈ పుట ఆమోదించబడ్డది

183

దినము మొదలుకొని రోగి చర్మము అంతయు నొక విధముగా కంది, పొక్కులెక్కి తుదగా పొక్కులలో చీపు పుట్టి పెద్ద పెద్ద కుండలును పుండ్లును ఏర్పడును. ఈ పుండ్ల వలన శాస్వతముగ నుండు మచ్చలను, ఒకానొకప్పుడు వికార రూపమును గలుగును. ఒక సారి మశూచకము వచ్చిన వారికి తిరిగి రాదు. మన దేశమునందు అనాది నుండి ఈ వ్యాధి యున్నట్లు కనబడుచున్నది. ఇంగ్లాండు దేశమునకు 1241 సంవత్సరము నందును ఈ వ్యాధి ప్రవేశించి నట్లు నిదర్శనములు గలవు.

మశూచకము నంటించు సూక్ష్మ జీవి ఇదియని ఇప్పటికిని నిశ్చయముగా తెలియక పోయినను, అది ఏదియో పొక్కులలోని చీమునందు ఉన్నదని రూఢిగా చెప్పవచ్చును. ఏలయన, ఈ చీమునెత్తి మరొకనికి అంటించిన యడల వారికి మశూచకము వచ్చుటయే ఇందులకు ప్రబల నిదర్శనము. ఇది యితరులకంతు విధమును జూడగా ఈ వ్వాధి ఏదో విధమున అనగా గాలి మూలమున గాని, తట్టలు సానానులు మొదలగు వాని సంపర్కము మూలమున గాని, అంటు చున్నట్లు తెలియ గలదు. రోగి యొక్క ఊపిరి తిత్తులలో నుండియు చర్మము నుండియు, బహుశః ఉమ్మి, మల మూత్రాదులు మొదలగు వాని నుండియు గూడ దీని సంపర్కము ఇతరులకు అంట వచ్చును. కాబట్టి రోగికి ఉపచారము చేయు నౌకరుల మూలమున గాని రోగి నివ