177
మందునీళ్లతో కలిపి ఇంటిలో కలియకుండ తగు విధమున పార వేయునెడల ఈ వ్యాధి మరియొకరికి అంట కుండ చేయ వచ్చునని నిశ్చయముగ చెప్పవచ్చును.
గ్రహణి విరేచనములు
పేగులలో కందుట చేతగాని పుండు పుట్టుట చేత గాని జిగట, చీము, నెత్తురు, కడుపు నులిమి వేయు నొప్పి, విరేచనమునకు పోవునడు ఆసనము నొప్పి మొదలగు లక్షణములతో కూడిన ఒకానొక విధమైన వ్యాధికి గ్రహణి అని పేరు.
ఇందు వ్యాధి లక్షణములను బట్టియు, వాని ఉధృతమును బట్టియు, వ్వాధి అనేక విధములుగ వర్ణింప బడి యున్నది. అందు ముఖ్యముగ రెండు జాతుల వ్యాధులు మిక్కిలి హెచ్చుగ నంటు స్వభావము గలవి. ఇవి క్షామ కాలముల యందును, యుద్ధ సమయముల యందును జైళ్ల లోను వచ్చినప్పుడు హెచ్చుగ ప్రజలను ధ్వంసము చేయును.
1. ఈ రెండు జాతులలో నొక జాతి విరేచనములు పేగుల లోనుండు డిసెంటరీ బాసిల్లను అను నొక జాతి సూక్ష్మ దండిక వలన కలుగు చున్నది.
2. రెండవ జాతి వ్యాధియందు పేగులలో అమీబా అను నొక విధమైన సూక్ష్మ జంతువులు హెచ్చుగ నుండును.
ఈ రెండు జాతుల వ్యాధులలో మొదటిది అనగా బాసిల్లసుగ్రహణి వచ్చునప్పుడే ఉధృతముగ వచ్చును. విరే