ఈ పుట ఆమోదించబడ్డది

173

మనము చేయు పనులన్నిటి కంటె ముఖ్యమైన దేమనగా మంచి నీళ్ల చెరువును కాపాడు కొనుట.

కలరా వ్యాపకము నుండి రక్షణ శక్తి కలిగించు టీకా రసములు ఇపుడు తయారై వచ్చు చున్నవి. వాని యుపయోగమును గూర్చి నిశ్చయముగా చెప్పుటకు వీలు లేక పోయినను టీకాలు వేసిక కొద్ది దినముల కైనను కలరా రాకుండ నుండ వచ్చునని చెప్పవచ్చును. 109 వ. పుటలను చూడుము. కలరా రోగులతో తప్పక సంబంధము కలిగించు కొనవలసి యున్న వైధ్యులును పరి చారకులును ఇట్టి టీకాలు వేయుంచు కొనుట ఉత్తమము. కలరా సూక్ష్మ జీవులు, పులుసు పదార్థములలో చచ్చి పోవును కాబట్టి 10 లేక 20 చుక్కల డైల్యూట్ సల్ప్యూరిక్ ఆసిడ్డు గాని కొత్త నిమ్మ పండు లోని 20 చుక్కల రసము గాని గ్రుక్కెడు నీళ్లలో వేసికొని ప్రతి దినము ఒక సారి త్రాగిన కలరా వ్వాధి అంట దని చెప్పుదురు.

సన్నిపాత జ్వరము (Typhoid Fever)

ఒకానొక విధమైన సూక్ష్మ జీవులు శరీరములో ప్రవేశించుటచే పేగులో పుండు పుట్టి సామాన్యముగా 21 దినములు మొదలు 8 దినముల వరకు విడువని జ్వరమును, శరీరము మీద ఒక విధమైన ఎర్రని చిన్న పొక్కులును, సామాన్యముగా రెండు మూడు వారములలో సంధియు కలిగించు వ్యాధికి సన్ని పాత జ్వరమనియు ఆంత్ర జ్వరమియు పేరు.