ఈ పుట ఆమోదించబడ్డది

172

మునందలి మురుగు కుండ్లను, నూతి దొడ్లను, దినదినము పరీక్షించి వానిని మందు నీళ్లత్తో శుభ్రముగ కడుగు చుండ వలెను. సూక్ష్మ జీవి నిలుచుటకు ఎక్కడను ఆధారము లేకుండ చూసుకొనవలెను.

నీరు వడబోయు యంత్రము.
38 వ. పటము.........................................39.వ.పటము.

1. నీరు వడపోయు యంత్రము యెక్క పై ఆకారము. కలరా మొదలగు అంటు వ్వాధి గల ప్రదేసములలో వివసించు వారెల్లప్పుడు నీటిని ఇట్టి యంత్రములతో వడ పోసి కొని గాని చక్కగ పొంగ కాచి గాని త్రావలెను.

2. నీరు వడపోయు యంగ్రము లోని నిర్మాణము. 1. మూత. 2. నీరు పోయు స్థలము. 3. ఈ నీటిని వడ పోయు గొట్టము. దీనిలో మిక్కిలి సన్నని రంద్రములుండును. ఈ రంద్రముల గుండ పరి శుభ్రమైన నీరు క్రిందికి దిగి కల్మషము పై పాత్రములో మిగిలి పోవును. 4. నిర్మలమైన నీరు చేరెడు భాగము. 5. నిర్మలమైన నీరు వచ్చు కొళాయి.