ఈ పుట ఆమోదించబడ్డది

171

చేపలు, తాబేళ్లు మొదలగు జంతువులు ఈ మందు వలన చచ్చిపోవును గాన వాటిని తీసిన పిమ్మటనే ఈ మందు వేసిన మంచిది. ఈ మందు వేసిన పిమ్మట తిరిగి కలరా సంపర్కము కలిగినదని తోచిన యెడల తిరిగి నూతి నీటిని శుబ్రము చేయ వలసినదే గాని ఒక సారి శుభ్రము చేసిన చాలునని అనుకొన కూడదు. ఒక నూతి నీటి వలనే కలరా వ్వాపించి యున్నదని తోచి నపుడు సాధ్యమైన యడల ఆ నూతిని మూసి వేయుటయే మంచి పద్దతి. లేదా అట్లు సాధ్యము కాని యెడల నీటిని చక్కగా మరగనిచ్చి చల్లార్చిన పిమ్మట త్రాగుట మంచిది. లేదా వడపోత యంత్రములతో వడపోసికొన వలయును. 38, 39 వ. పటములను జూడుము.

మనము తిను పదార్థముల మీద ఈగలు మొదలగు జంతువులు వ్రాల కుండ చూచు కొనవలయును. చక్కని శరీరారోగ్యము గల వారిని సూక్ష్మజీవులు అంటినను అవి అపజయము నొందును. కాబట్టి ఎల్లప్పుడు ఇండ్లను గ్రామములను పరి శుభ్రముగ నుంచు కొనుచు నిర్మలమైన వాయువు మన ఇండ్ల యందు మూలమూలలకు ప్రసరించు నట్లు జూచు కొనవలయును. ఒక ఇంటిలో నీ వ్యాధులు ప్రవేశించి నప్పుడు రోగిని ప్రత్యేక పరచి ఆ రోగి నుండి ఇతరుల కంటు సోక కుండ చేసికొను పద్ధతుల నవలంభింఫ వలయును. (121, 122.వ. పుటలను జూడుము)

పల్లపు భూమలలో మురుగు కాలువలు త్రవ్వించి యెప్పటికప్పుడు నీరు క్రిందికి పోవునట్లు చేసి కొనవలెను. గ్రామ