ఈ పుట ఆమోదించబడ్డది

170

నివారించు మార్గములు

రోగిని ప్రత్యేక పరచుట గూర్చియు ప్రకటన చేయుట గూర్చియు శుద్ధి చేయు విషయములను గూర్చియు, 12,13., ప్రకరణములలో వ్రాసిన విషయమును చక్క గమనింప వలయును. రోగుల విరేచనములు కలరా వ్వాపకమున కెంత సహాయ కారులో మూత్రమును, వాంతులు కూడ అంత సహాయ కారులనిజ్ఞప్తి యుంచు కొని వాని నన్నిటిని రంపపు పొట్టులో గలిపి కాల్చి వేయ వలెను. లేదా నూటికి అయిదు పాళ్లు గల కర్బాలికపు మందు నీళ్లలో గాని వేయింటి కొక పాలు గల సౌవీరపు మందు నీళ్లలోగాని ఎప్పటి కప్పుడు కలిపి వేసి దానిని నూతులకు దూరముగా పాతి వేయవలెను. సామాన్యముగా రోగి నంటి యుండు వివుల వేని బట్టలను పడకలను కాల్చి వేయవలెను. గదిలోని సామానులను కార్బాలికు మందు నీళ్లతో కడిగి వేసి ఎండలో ఎండ నీయ వలెను. గ్రామము నందలి నూతులలో సాయంకాలపు వేళ పొటాసియం ప్రొమేగ్ నేటు అను మందును నీటికి చంద్ర కాంత పువ్వు వర్ణము వచ్చు నంత వరకును కలిపి రాత్రియంతయు నిలువ యుండనిచ్చి ఉదయము వాడుకొన వచ్చును. నీటి యందు కొద్దిపాటి వాసన యున్నను రంగున్నను గమనింప వలసిన పని లేదు. రంగు గల నీటిని త్రాగినను విషము కాదు. కలరా సూక్ష్మ జీవులు ఈ మందుచే చచ్చును గాన కడుపు లోనికి నీరు పోయినను మంచిదే. నూతులలో నుండు