ఈ పుట ఆమోదించబడ్డది

165

సమయములలో ప్రవాహపు నీటి యందు దీని కాహారము జాలక చచ్చి పోవును. బహుశః మిక్కిలి చలిని కూడ ఈ సూక్ష్మ జీవి భరింప జాలదు. కలరా అధికముగా వ్యాపించుటకు ఈ క్రింద కనబరచిన అయిదు షరతులు కావలెను.

1. కలరా సూక్ష్మ జీవి యుండవలెను. 2. మన శరీరమునకు వెలుపల అనగా భూమిలో గాని నీటిలో గాని దాని వృద్ధికి తగిన ఆహారము శీతోష్ణస్థితి గల పురుటి ఇల్లు ఉండ వలెను. 3. ఈ సూక్ష్మ జీవి ఒక గ్రామము నుండి మరొయొక గ్రామమునకు పోవుటకు తగిన మార్గము లుండ వలెను.

4. ఒక చోట ఇది ప్రవేశించిన తర్వాత ఒకరి నుండి మరియొకరి కంటు కొనుటకు తగిన వాహనము లుండవలెను. 5. ఇది ప్రవేశించిన చోట నుండు ప్రజలకు ఈ సూక్ష్మ జీవి సంబంధము కలిగినను వ్యాధి వచ్చు స్వభావము ఉండవలెను.

ఈ అయిదింటిలో ఏది లేకున్నను వ్యాధి వ్వాపించుటకు వీలు లేదు.

1. సూక్ష్మజీవి: ఇది ఒక కలరా రోగి విరేచనములో నుండి మరియొక రోగి కడుపులోనికి తిన్నగా పోవుట అసంభవము. ఇది నీటిలో గాని పొలములో గాని భూమిలో గాని గుడ్డలలో గాని కొంత కాలము పెరిగిన తర్వాత దీని మనుమలును ముని మనుమలును ఇతరులుకు చేరును గాని మొదటి రోగి విరే