ఈ పుట ఆమోదించబడ్డది

పదునయిదవ ప్రకరణము

ఆహారము మూలమున గాని నీటి మూలమున గాని వ్యాపించు వ్యాధులు

కలరా: టైఫాయిడు జ్వరము: గ్రహణి విరేచనములు

కలరా అనగా విశూచియు, టైఫాయుడు జ్వరమనగా మూడు నాలుగు వారములు విడువక యుండి సంధి జ్వరమును, అమీబిక్ డిసెంట్రీ అనాగా నొక తరహా గ్రహణి విరేచనములును మనము భుజించు ఆహారము మూలమునను, త్రాగు నీటి మూలమునను మన శరీరములో ప్రవేశించును.

తంజావూరు రైలు స్టేషనులో అమ్మిన ఉప్పు పిండిని (ఉప్మా) రైలులో చెన్న పట్టణము వచ్చు చుండెడు డిప్టీ కలెక్టరు ఒకరు కొనుక్కుని తినెను. అతడు తినగా మిగిలిన కొంత ఉప్పిండిని చెన్న పట్టణమునకు వచ్చిన తరువాత వాని అన్నవంట వాడు తినెను. ఇదారుకూ మరునాడే కలరా వచ్చెను. వీరి విరేచనములను సూక్ష్మ దర్శినితో శోధన చేయగా కరా సూక్ష్మ జీవులు స్పస్టముగ కనబడినవి. ఆహారము మూలమున కలరా వచ్చుననుటకు ఇంతకంటే నిదర్శనము కావలెనా?

కలరా

మర మేకుల వెలె మెలి తిరిగి యుండు కామా సూక్ష్మ జీవియను పేరు గల ఒకానొక సూక్ష్మ జీవి నీటి మూలమున గాని