ఈ పుట ఆమోదించబడ్డది

160

నిమిత్తమై చిన్న చిన్న వ్వాసములను ప్రచురించియు, లాంతరు పటములను గనుకరచియు (మాజిక్ లాంతరన్) విద్యాభివృద్ధి గావింప వలెను.

పెద్దవిగా పెరిగిన దోమలు సాధారణముగా దండెముల మీద వ్రేలాడ వేసిన బట్టల చాటునను, చీకటి గదులలోను దాగి కొనియుండును. గంధకము సాంబ్రాణి మొదలగు పదార్థములను పొగ వేసిన ఎడల దోమలు ఆ పొగను భరింప జాలక పారిపోవును.

2. ప్రతిమానవుని దోమకాటు నుండి కాపాడుట.

దోమలు రాత్రుల యందేకాని కుట్టవు. కావున ప్రతి మానవుడును రాత్రుల యందు దోమల తెరలో పరుండిన యెడల దోమలు ఇంటిలో నున్నను వారలను కుట్టనేరవు. మిక్కుటముగ చలి జ్వరము గల ప్రదేశములలో సయితము, అక్కడకు శోధనల నిమిత్తమై పోయిన వైధ్యులు నెలల కొలది యక్కడ నివశించియు చలి జ్వరము పాల బడకుండ దోమ తెరల మూలమున తప్పించు కొని యున్నారు.

కావున చలి జ్వరము నుండి తప్పించు కొనవలెననిన యెడల 1. చలిజ్వరపు పురుగులనైన నశింప జేయ వలెను. లేక 2. దోమనైన నశింప జేయవలెను.