ఈ పుట ఆమోదించబడ్డది

152

పదునాలుగవ ప్రకరణము

దోమలచే వ్యాపించు వ్యాధులు

ఇంతవరకు అంటు వ్వాధులన ఏవియో నిరూపించి వానిని నివారించు పద్ధతులను సర్వ సామాన్యముగ నన్ని యంటు వ్యాధులలొ ముఖ్యమయిన వానిని కొన్నిటి నెత్తుకొని ఒక్కొక్కటి ఏ ఏ మార్గమున ప్రవేశించునో ఎట్లు వాని వ్యాపకమును నివారింప వచ్చునో సంక్షేపముగ తెలియ పరచెదము.

సామాన్యముగ మనదేశమునందు హెచ్చుగ వ్వాపించు మార్గములను బట్టి వానిని నాలుగు తరగతులగ విభజింప వచ్చును.

1. దోమలు చే వ్వాపించునవి:... చలి జ్వరము: బూద కాలు.

2. ఆహారము మూలమున గాని నీటి మూలమున గాని వ్వాపించునవి: కలరా, టైపాయిడు జ్వరము, గ్రహణి విరేచనములు.3. గాలిచే వ్యాపించునవి: మశూచికము, పొంగు, ఆటలమ్మ, కోరింగ దగ్గు, గవదలు మొదలగునవి.