ఈ పుట ఆమోదించబడ్డది

స్థావరకణములు

87



పైని చెప్పిన కణములలో ముఖ్యముగ సూక్ష్మజీవులను పట్టితినునవి బహురూప జీవస్థానములుగల తెల్లకణములు. జీవస్థానమేకముగ గల పెద్దకణములకును, నెత్తురులోగాక కండలు నరములు మొదలగు సంహతుల నడుమనుండు కొన్ని కణములకు కూడ సూక్ష్మజీవులను పట్టి తిను శక్తికలదు. ఇందు కొన్ని యొక చోటనుండక యెల్లపుడు తిరుగుచుండును. కావున వానికి జంగమకణములని పేరుకలిగెను.

స్థావరకణములు

పైని వివరించినవిగాక తాము నివసించుచోట్లనే కదలకయుండి దొరికినినప్పుడెల్ల సూక్ష్మజీవులను పట్టితినుశక్తిగల కణములుకొన్నికలవు. మన పేగులయందలి ఆమ్లపు పొర యందును గ్రంధులయందును లోపల వైపున పరచియుండు అంతశ్చర్మ కణములును, ప్లీహము (Spleen) నందును ఎముకలలోని మూలుగు (Bone Marrow) నందు నుండు కణములును ఒకానొకప్పుడు నరములలోని కణములను, కండలలోని కణములును కూడ సూక్ష్మజీవులను పట్టిచంపును. ఇవి యన్నియు స్థావరకణములు.

కణవాదము

తిండిపోతు తెల్లకణములు

సూక్ష్మజీవులను చంపు నీ జంగమకణములకును స్థావరకణములకును కూడ తిండిపోతుకణములని పేరు. మెచ్ని