ఈ పుట ఆమోదించబడ్డది
నెత్తురుయొక్క స్వరూపము
83
వీని కెదురుపడి పోరాడుచున్నందున వీనిదండయాత్రలునిలుచుచున్నవికాని వేరుకాదు. ఇట్లు పోరాడు మన సిబ్బందిలో రెంటినిగూర్చి మన మిదివరలో వినియున్నాము. ఇవి మన నెత్తురులోనుండు తిండిపోతు తెల్లకణములు విరుగుడు పదార్థములే.
నెత్తురుయొక్క స్వరూపము
1884 సం॥ర ప్రాంతమున మెచ్నికాఫ్ అనునతడు నెత్తురులోని కొన్ని తెల్లకణములు సూక్ష్మజీవులను పట్టి తినునని కనిపెట్టెను. ఈ తెల్లకణములలో రెండువిధములు కలవు. కొన్ని జంగమ తెల్లకణములు; కొన్నిస్థావర తెల్లకణములు. వీని భేదములను చక్కగా గుర్తెరుగుటకై యెకనెత్తురుబొట్టు నెత్తి దానిని సూక్ష్మదర్శినిలోనుంచి పరీక్షింపవలెను. 27-వ పటమును జూడుము.
27-వ పటము.