ఈ పుట ఆమోదించబడ్డది

82

తొమ్మిదవ ప్రకరణము


పొరలో గాయములు లేకున్నంతకాలమును, వ్యాధిగాని బలహీనతగాని లేకున్నంతకాలమును సూక్ష్మజీవుల నిది మన రక్తములోనికి చొరనియ్యదు. దొమ్మ సూక్ష్మజీవులను చుంచులకు ఆహారములో కలిపి యెన్ని పెట్టినను వానికి వ్యాధి రాదు. గాయముగుండ చర్మములోని కెక్కించినను, మెత్తని పొడిచేసి పీల్పించినను వెంటనే వ్యాధి అంటును. ఇవిగాక స్త్రీల యొక్క సంయోగావయవములలోనుండి యూరుద్రవములలో నొకవిధమైన ఆమ్లపదార్థముండి యది సామాన్యముగా సూక్ష్మ జీవుల నన్నిటిని చంపును. ఆభాగమునందేదేని గాయము గాని, వ్యాధిగాని యున్నప్పుడే సుఖవ్యాధు లంటునుగాని, మిక్కిలి యారోగ్యదశలో నీ యవయము లున్నయెడల సుఖవ్యాధులు తరుచుగ నంటవు. మనము విసర్జించుమూత్రము నందుకూడ సామాన్యముగా కొన్నిసూక్ష్మజీవులను చంపు గుణముకలదు. పైని వివరింపబడిన కాపుదలలేగాక మన శరీరమునందు సూక్ష్మజీవులు సులభముగ చేరకుండ మనలను రక్షించుటకు మిక్కిలి క్లిష్టములగు వ్యూహము లెన్నియో గలవు. అవి యన్నియు మనకింతవరకు తెలియవు. తెలిసినవరకు మిక్కిలి ముఖ్యములగు విషయములు దినదినమున నుపకరించునవి కొన్ని గలవు. మనశరీరములో సూక్ష్మజీవులకు తగిన ఆహారముండగా నవి ఎందుచేత మన శరీరములో ప్రవేశించినప్పుడు పెరుగవు? ఏవో వీనికి హానికరములగు పదార్థములు