సహజరక్షణశక్తి
81
సూక్ష్మజీవులశక్తికంటె తెల్లకణములశక్తి హెచ్చినప్పుడు బిళ్లలు కరిగిపోవును. తెల్లకణములశక్తిసూక్ష్మజీవులక్రౌర్యమునకు లోబడినపుడు చీము యేర్పడి కురుపుగా తేలును. అనేకమందికి మెడయందును, ఇతర స్థలములందును బిళ్లలు వరుసలు వరుసలుగా పుట్టును. ఇవన్నియు ఏవోసూక్ష్మజీవులు శరీరములో ప్రవేశింపవలెననినప్పుడు వానితో పోరాడుటకై చేరియుండు తెల్లకణముల సమూహములచే నుబ్బియున్నవని గ్రహింపవలెను. క్షయయందును, సవాయమేహము (Syphillis) నందును ఈ బిళ్లలు ఉబ్బును. తేలుకుట్టినప్పుడు గజ్జలలో బిళ్లలు నొప్పి యెత్తునది విష మక్కడ నిలిచిపోవుటచేతనే కలుగుచున్నది.
మన నోటిగుండ సూక్ష్మజీవులు ప్రవేశింపవలెననిన వానికెందరు విరోధులున్నారో యాలోచింతము. మననోటిలో నూరు ఉమ్మి యనేకజాతుల సూక్ష్మజీవులను తొలుతనే చంపివేయును. అక్కడనుండి పోయినతర్వాత మన ఆహార కోశము (Stomach)లో బారుచుండు జాఠరరసము (Gastric Juice) యొక్కపులుపు అనేకరకముల సూక్ష్మజీవులను నశింప జేయును. ఇవిదాటి సూక్ష్మజీవులు పేగులలోనికి పోయినను అన్నియెడలను సూక్ష్మజీవులు మనకపకారము చేయలేవు. మన పేగులయందు సర్వత్ర ఆవరించి యొకదళమైనట్టియు మృదువైనట్టియు పొర (Mucous Membrane) గలదు. ఈ
- 6