పుట:Annamacharya Charitra Peetika.pdf/97

ఈ పుటను అచ్చుదిద్దలేదు

95 అన్నమాచార్యాదులు తిరిగినదేశములు అన్నమాచార్యుఁడు కడప, కర్నూలు,బళ్ళారి,యనంతపురము, చితూరు, చెంగల్పటు, ఆర్కాడు, నెలూరు, గుంటూరు, తంజావూరు, తిరుచినాపల్లి మండలములలో నంచారము చేసినటున్నాఁడు. కృష్ణాగోదావరి మండలముల నెఱుఁగడేమో! అన్నమాచార్యుని మనుమఁడు చిన్నన్న గుంటూరు కృష్ణామండలములఁగూడఁ దిరిగినవాఁడు. ఆతనికి శిష్యులు సాలెవారు సర్వాంధ్రదేశమున నుండిరి. కీర్తించినవేల్పులు అన్నమాచార్యుఁడును ఆయనకొడుకు పెదతిరుమలాచార్యుఁడును మనుమఁడు చినతిరుమలాచార్యులును నీక్రింది పుణ్య స్థలములలోని దేవతలఁ బేర్కొని సంకీర్తనములు చాల రచించిరి. మాడుపూరికేశవుఁడు కృషుఁడు దానరిపల్లె రాముఁడు మండెమునృసింహుఁడు కదిరి నృసింహుఁడు కదిరి వనంతుఁడు చెంజినవనీత కృషఁడు కళసాహనుమంతుఁడు అహెూబల నృసింహుడువిజయనగరవేంకటేశ్వర విట్టల నరసింహహనుమంతులు కడప వెంకటేశ్వరుఁడు తిరువళాచ్చి విషుఁడు తిరువళ్ళూరి వీరరఘవుఁడు కంచి వరదరాజు గండవరము గోపాలుఁడు కుఱునూతుల చెన్నఁడు చేగలమట్టి చెన్నుఁడు వావిలిపాడు రాముఁడు ఉద్దగిరికృష్ణుడు గుత్తిరాముఁడు, వెలుగోటికేశవుఁడు, వుంగాంబుధి హనుమంతుఁడు, నల్లబల్లి చెన్నుఁడు,ఊటుకూరి చెన్నకేశవుఁడు, కోవెలగుంట్ల గోపాలకృష్ణుఁడు, ఓగునూతులనృసింహుఁడు కోనచెన్న రాయుఁడు శ్రీరంగము రంగనాథస్వామి ఒంటి వెుట్ట వీరరఘురాముఁడు చుక్కపల్లి చెన్నుఁడు కోసువానిపల్లె చేళ్ళపిళ్ళ, నెలూరు-అధ్యాత్మసంకీర్తనములలో చదివిచూచి నంతలోఁ గానవచ్చిన వివి, కడముట్టఁబరిశీలించినపై నింక నెన్నియగునో! నంకీర్తనముద్రాసామ్యములు తాళ్ళపాక అన్నయ తిరుమలాచార్యులకు నిన్నూఱువర్షములఁ దర్వాతి కాలమున క్రీ 1650 ప్రాంతముల వర్తిల్లినత్యాగరాయలవారును క్షేత్రయ్య కించుమించుగా నిన్నూజేండ్లతర్వాత వర్తిల్లిన త్యాగరాయల