ఈ పుట ఆమోదించబడ్డది

"అత్తీవంచ" పద్యములోని పదాల కర్థమిట్లు చెప్పవలెను. అత్తీవంచ-ఆతీవంచ, తీవంచ-నాలుగు, తిగ-మూడు, దుగ-రెండు, సత్తా-ఏడు, తచ్చౌక-ఎనిమిది, వంచి-ఒకటి (తచ్చౌకవంచి-ఎనిమిది న్నొకటి-తొమ్మిది అని యర్థమేమో) చౌవంచ-అయిదు, ఈరైదు-పది, ఇత్తిగ-ఆరు, ఇద్దుగ-నాలుగు, బద్రలు-పన్నెండు.

ఇక ఈ యాట నిప్పు డెట్లాడుచున్నారో తెలుసుకొందము.

ఆట యాడువా రిద్దరుకాని నలుగురుకాని యుండవచ్చును. పందెము వేయు పాచికలను సారెలు అందురు. అవి దంతమువి కాని, కట్టెవి కాని, లోహములవి కాని యైయుండును. నాలుగు మూలలు కల రెండు సమానమగు పాచికలుండును. ఒక్కొక్కసారెకు నాలుగు ముఖాలపై ఈ క్రింది విధముగా చుక్కలుండును.

పై పేజీలో కనబరచిన పరిణామములో పాచికలుండును. ఒక్కొక్క పాచికయొక్క నాలుగు భాగాలలో 1, 3, 6, 4, ఈ వరుసగా చుక్కలుండును. ఇట్టి రెండు పాచికలను అరచేతిమీదుగా లొడిపి నేలపై వేయుదురు. పైకి పడిన భాగాల చుక్కల లెక్కించి వాటి సంఖ్యను బట్టి కాయలను ఇండ్లలో నడుపుదురు. పచ్చీసు అయిదు గవ్వలు వెలికిలబడిన పచ్చీసనియు, 6 పడిన