ఈ పుట ఆమోదించబడ్డది

పెట్టెలు (?), మంచములు, తమ్మపడిగెలు, బొక్కసములు, బోనకావళ్ళు, పల్లకీలు మున్నగునవి తీసుకొనిపోవుచుండిరి.[1]

ఆ కాలమందు తప్పెట్లు, కాహళములు, కాలికొమ్ములు, డమాయీలు, బూరలు, శంఖములు, సన్నాయీలు, డోళ్ళు, రుంజలు, చేగంటలు అన్నీ కలిసి గందరగోళముగా అపశ్రుతితో ధ్వనించుచుండిరి.[2] (రుంజలు అనునవి నగారావంటి వాద్యములట) గొల్లెనలు అన్న బట్టల డేరా లని యర్థము. కాని పటకుటీరములును డేరాలేకదా! ఈ రెంటిలో భేదముండెను. పటకుటీరములను డేరాలనియు వాడిరి. గొల్లెనలు మధ్య స్తంభము మీద మాత్రమే గోళాకారముగా నిలిపినట్టివి. నడిమి కంబము కూలితే డేరా యంతయు కూలి పడెడిది[3] యుద్ధకాలములో ఓడిన వారు సంధి చేసుకొందు మనియు, యుద్ధము నాపవలసిన దనియు తెలుపుటకై కొమ్ము పట్టించి ధ్వనించెడివారు. దానిని ధర్మధార యనిరి.[4] యుద్ధము జరుగుచుండగా ప్రతిపక్షవీరుల కత్తిపోటులనుండి తల గాచుకోదలచిన వారు ప్రాణదానము పలువిధముల వేడుచుండిరి. మేము పల్లకీ బోయీలమే కాని భటులము కాదనువారును, చచ్చినట్లుగా రణరంగముపై పడియుండు వారును, చచ్చిన శవాలను మీదవేసుకొని దాగువారును, "పెండ్లాల తలచుక బిట్టేడ్చువారు"ను పలుతెరంగులై యుండిరి.[5]

అంతేకాదు,

"వల్మీకముల మీద వసియించువారు,
గడ్డిలో జొరబడి కదలనివారు.
వేళ్ళు చీకెడివారు, వెన్నిచ్చువారు.
వెండ్రుకల్ విప్పుక విదలించువారు."[6]

  1. పల్నాటి వీరచరిత్ర, పుటలు 3, 4.
  2. పల్నాటి వీరచరిత్ర, పు 4, మరియు 108.
  3. బాణము ఘనమైన గొల్లెనకంబంబు దాకె, అదియంత తునకలై యవనిపై బడెను. పల్నాటి పు 37.
  4. "పోరించి ... ధర్మదార పట్టించుచు నున్నవాడు. క్రీడాభిరామము.
  5. పల్నాటి వీరచరిత్ర పు 110.
  6. పల్నాటి వీ. చ. పు 110.