పుట:Andrulasangikach025988mbp.pdf/409

ఈ పుట ఆమోదించబడ్డది

కూడా డల్‌హౌసీ కాలములో ప్రారంభించిరి. 1856 వరకు 200 మైళ్ళ రైల్వే లైను వేయబడెను.

సతీ-సహగమనము అను భయంకర దురాచారము హిందువులలో ప్రబలి యుండెను. అది బెంగాలు, బీహారు, రాజపుత్ర స్థానములలో హెచ్చుకాని తెనుగుసీమలో అరుదై యుండెను. రాజా రామమోహనరాయల ప్రోద్బలముతో 1829లో దానిని నిషేధించిరి. దేశమును జిల్లాలుగా విభజించి లేక పూర్వము వాటినే జిల్లాలుగా పరిగణించి ఇంగ్లీషు కలెక్టర్ల నేర్పాటు చేసిరి. ఈ విధమగు చిల్లర మార్పులు మరికొన్ని జరిగెను. ఇట్లు తిన్నగా మనము ఆధునిక యుగములో పడినవార మయితిమి. 1856 లో వితంతూద్వాహ శాసనము చేసిరి.

డల్‌హౌసీ 1856 లో వెళ్ళిపోయెను. హిందూ మసల్మానులు-అందెక్కువగా ముసల్మానులే-తమ ఆధిక్యత పోయెననియు అందరును పరాధీనులయిరనియు, తమ మతాలకు, ఆచారాలకు అఘాతము కలుగజొచ్చెననియు గ్రహించిరి. దాని ఫలితమే 1857 నాటి సుప్రసిద్ద విప్లవము. అది జాతీయ వికాసమునకు మొదటి ప్రయత్నము. ఈ సమీక్షా కాలములో ఆంధ్రుల పతనము సంపూర్ణమయ్యెను. వాఙ్మయము, కళలు, పరిశ్రమలు అన్నియు ఇంచుమించు శూన్యస్థితికి వచ్చెను. 1857 భారత చరిత్రలో ముఖ్యాతి ముఖ్యఘట్టము. దానితో మనము ఆధునిక యుగములోనికి వచ్చినాము.

ఈ ప్రకరణానికి ముఖ్యాధారములు

1. అయ్యలరాజు నారాయణకవి:- హంసవింశతి, ఇతడు అడుగడుగున మొదటినుండి తుదివరకు శుకసప్తతి ననుకరించినాడు. అయినను కొన్ని కొత్తవిషయాలు తెలిపినాడు. ఇతడు 1800 ప్రాంతమువాడు. ఇతడు నెల్లూరివాడని వావిళ్ళవారు, కర్నూలు వాడని శృంగార గ్రంథమండలి రాజమండ్రివారు పీఠికలలో వ్రాసినారు. ఉభయులు ఆధారాలు చూపలేదు. శృంగార గ్రంథమండలివారి పీఠీక ఉత్తమమైనది. వావిళ్ళవారి పీఠిక మంచిదికాదు.

2. భాషీయ దండకము:- గండూరు నరసింహకవి. ఇతడు కర్నూలువాడు. 1800 ప్రాంతమువాడు. భాష కర్నూలు గ్రామ్యము. ఇందు కొంత హాస్యము, అపహాస్యము, బూతులు కలవు. దీనిని రామా అండుకోవారు