పుట:Andrulasangikach025988mbp.pdf/400

ఈ పుట ఆమోదించబడ్డది

యువతులను ముగ్గురి నల్గురి కలగట్టి మూటలవలె తమ గుర్రాలపై వేసి బానిసలుగా అమ్ముకొనుటకు తీసికొనిపొయిరి." (R. Williams P. 141-43.)

పిండారీలు స్త్రీలను వారి భర్తలయెదుటనే చెరిచెడివారు. తాము తీసుకొని పోజాలని వస్తువులనైన వదలక వాటిని ధ్వంసముచేసి పోయెడివారు. ధనము దాచిన తావులు చూపనివారిముఖానికి ఉడుకుడుకు బూడిదను సంచులలో నింపి కట్టి వీపున గ్రుద్ది ఆ బూడిద వారినోళ్ళలో ముక్కులలోపోసి ఊపిరి తిరుగకుండునట్లు చేసెడివారు. తర్వాత వారు చాలాకాలము బ్రదుక కుండిరి. జనులను వెలకిల పండబెట్టి ఎదలపై పెద్దపలకలబెట్టి వాటిపై జనులచే త్రొక్కించెడివారు. ఇట్టి అమానుషకృత్యా లెన్నో చేసిరి. పిండారీలలో మరాటీ లెక్కువైనను వారితో బాటు మొగల్ రాజ్య సేనాభ్రష్టులును, దోపీడీల రుచి గొన్నవారును నగు ముసల్మానులు పెక్కుండిరి. వారి స్త్రీలు వారివెంట నుండిరి. హిందూ స్త్రీలవలె వేషాలు వేసుకొని హిందూ దేవతలనే కొలిచెడివారు. (బహుశా వారు పూర్వము హిందువులై బలవంతముగా ఇస్లాం మతము పుచ్చుకొన్న వారి సంతతియై యుందురు). వారు సవారిచేసి బయళ్ళలో సంచరించి కర్కశకాయలై మగంగులై మగవారి నెత్తి దన్నినవారైన లంకిణీలు మగవారికంటే వారే రాకాసి పనులుచేసి కరుణ అన్న దే కోశమందును కాసంతయు లేనివారై ప్రజల హింసించు చుండినందున జనులు వారిని చూస్తే నిలువున నీరయ్యేవారు. ఈ ఘోరాలు ఎక్కవగా కంపెనీ ఇలాఖాలలో కావడము చేత తుదకు హేస్టింగ్సు గవర్నరు జనరల్ 1,200,000 సైన్యమును సమీకరించి వారిని ధ్వంసము చేసెను.

పిండారీపీడ దేశానికి తప్పెను కాని మరొక ఈతిబాద దేశానికి తగుల్కొనెను. అది ఠగ్గుల బాధ. తెనుగులో టక్కు, టక్కరి అన్నపదము కలదు. "పట్టుకొని చాగర గొన్న బలే యెరుంగు, టక్కరి, బలుమోపు మోచు నయగారితనం బది యుట్టి గట్టినన్" అని 1300 ప్రాంతమందుండిన నాచన సోమన వాడెను. ఠగ్, లేక మరాటీఠక్ అను పదాలకు మన టక్కుకు టక్కరికి యేమైన సంబంధముండునా! ఠగ్గు వృత్తిచర్చ క్రీస్తుశకము 13వ శతాబ్దములోని ఫీరోజు ఖిల్జీ డిల్లీ సుల్తానుల కాలమందు కలదు. అతడొకమారు 1000 మంది ఠగ్గుల శిక్షించెను. అనగా అంతకంటే పూర్వము నుండియే యీ విధానముండినది. అది మన సమీక్ష కాలపు అరాచక స్థితిలో విజృంబించెను. అందు తురకలునూ ఉండిరి. అందరును కాళీ పూజకులే. సంఘములో చేరు వారికి దీక్ష