పుట:Andrulasangikach025988mbp.pdf/372

ఈ పుట ఆమోదించబడ్డది

నూటికి 70 లేక 80 పాళ్ల సుంకము వేసియో లేక అమ్మకుండా నిషేదించియో వారిని నష్టపెట్టుచున్నది. ఇట్లు చేయకుండిన మన మిల్లులు మూతబడి యుండెడివి.'

మన్రో యిట్లనెను. 'మద్రాసు సూబాలో కంపెనీవారు సాలెవాండ్లను పిలిచి బలవంతముగా కారుచౌకగా తమకు బట్టలు నేసి యిచ్చునట్లు బాధించి ఒప్పందములు చేసిరి. వారు బట్టలు నేయుటలో ఆలస్యము చేసిన కంపెనీ నౌకర్లు వారిపై కావలియెక్కి దినము ఒకఅణా జుర్మానాను తీసుకొని పైగా బెత్తాలతో సాలెవారిని కొట్టి బాధించెడి వారు. (Chapter 14.)

ఇంగ్లీషువారు ప్లౌసీ యుద్ధముతో బెంగాలును 1760 లో వండి వాష్ యుద్ధముతో మద్రాసు సూబాను ఆక్రమించుకొన్న తర్వాత కూడ హిందూస్థానమునుండి భారతీయులు తమ సరకులను ఇంగ్లండుకు అమ్ముటకై తమ ఓడలలో తీసుకొని పోయిరి. అప్పుడు తేమ్సు నదిలో మన ఓడలను ఇంగ్లీషువారు చూచి తేమ్సుకు నిప్పంటుకొనెనా అన్నట్లు రిచ్చవడి మన యోడలను చూచిరట : భారతీయులే - మన బానిసలే - మన దేశములోనే తమ యోడలలోనే మనకు పోటీగా వ్యాపారం చేస్తారా ? అన్న యాగ్రహము కలుగగా కొన్ని యేండ్లలో మన ఓడలు మన పరిశ్రమలు మన సంపద అన్నియు మాయమై పోయెను. జనులకు భూములే మిగిలెను.. కాని వాటి ఫలితములో సగము అంతకంటే యెక్కువ పన్నుల పేరుతో కంపెనీవారు లాగుకొనిపోయిరి.

'1764 నుండి 66 వరకు ఇంగ్లీషు సరకుల వ్యాపారము ఏటేట ఇంచుమించు 22 లక్షల 30 వేల రూపాయలదై యుండెను. 1780 లో 35 లక్షల 50 వేల దయ్యెను. 1785 లో ఇంగ్లండులో ఆవిరి యంత్రములు ప్రారంభమయ్యెను. ఆ సంవత్సరం మన దేశానికి 85 లక్షల 50 రూపాయీల సరకు పంపిరి. 1790 వర కది 1 కోటి 20 లక్షలవరకు పెరిగెను. 1800 వరకు అంత నాల్గంతలయ్యెను. 1809లో 10 కోట్ల 84 లక్షల రూపాయీల సరకు మనదేశానికి దిగుమతి యయ్యెను. 1793 లో పార్లమెంటు నివేదికలో ఇట్లు వ్రాసిరి. 'హిందూస్థానమందలి ప్రతి దుకాణములో ఇంగ్లీషు మల్లు బట్టలనే అమ్ముచున్నారు. అవి దేశి బట్టల దరలో నాల్గవ వంతుకే అమ్ముచున్నారు. (History of India-Rush Brook Willims. III. P. 132-3.) యంత్రయుగ మేర్పడుట, ఇంగ్లీషు వారు మన దేశమును వశపరచుకొనుట, మన పరిశ్ర