పుట:Andrulasangikach025988mbp.pdf/355

ఈ పుట ఆమోదించబడ్డది

ఆనందకరమగు వినోదము. విశేషముగా భాగవత కథలను ప్రదర్శిస్తూ ఉండినందున నాటాకాలాడువారిని భాగోతులు (భాగవతులు) అని అనుచుండిరి.

         రాతిరి సూస్తి యేసములు రమ్మెముగా గురులాన, మొన్న బా
         గోతుల సత్తెబామ, యనగూడని తాపములెల్ల సేసె, మా
         పాతకురాలు రాద, వలపచ్చము రుక్మిణిసుద్ది కిష్టమం
         టీ తెరుగానడంచు వచియించును మూర్ఖుడు చందరశేఖరా॥


        "దస్తుగ మొన్ననే బురళదాసళచేత గడించి నాట్యమాడిస్తిని"

అనుటచేత దాసళ్లే ఎక్కువగా బయలు నాటకాలాడు చుండిరని తోస్తున్నది.

నాటికిని నేటికిని జాతర లన పల్లెజనులకు చాలా వేడుక.

        'ఇరిదిగ సూస్తి తీరతము లెన్నెనొ, ఆవనగొండ గంగజా
         తరసరిరావు, పంబలును తప్పెటలున్ కొముగాండ్ల సిండ్లసం
         బరమెరి దెల్పు మింకొక పబావము రంకుల రాటమెక్కెనే
         తిరిగిన సాటిరాదని నుతించును మూర్ఖుడు చంద్రశేఖరా॥

జాతర్లలో నేటికిని పై రెండు వేడుకలు జరుగును.

ఆ కాలములో ఓనమాలు, ఎక్కాలు కా గుణితము ఇసుకలో దిద్దించి చెప్పించుచుండిరి. నేటికిని దాని జాడలు పెక్కు పల్లెలలో కలవు. పేర్లు వ్రాయడము నేర్పినపిమ్మట పలక పట్టించేవారు. తర్వాత భాగవత భారతాలు చదివించేవారు. ఆ ముచ్చటనే కవి యిట్లు వర్ణించినాడు :

        నన్ను సదించె బాబు సినవాడు, తమాసగా భాగవతంబు రా
        మాన్నము, బారతంబును, తమామును కిందివి ముందెవచ్చె, నే
        విన్ని సదుండగానే బపుయెత్తుము నోరిక బాపనాండ్లు నా
        కన్నను లొజ్జటండ్రు, పలుగాకులు ముర్ఖులు చంద్రశేఖరా.

(క్రిందివి ముందెవచ్చె=నేలపై ఇసుకలో నేర్చుకొను చదువు ముందుగానే వచ్చెను.)

బడికాలము తెల్లవారుజామునుండియే చీకటి యుండగానే ప్రారంభమయ్యెడిది. గురువు వద్ద బరిగయో కొరడాయో ఉండెడిది. మొదట వచ్చిన