పుట:Andrulasangikach025988mbp.pdf/329

ఈ పుట ఆమోదించబడ్డది

అత్యల్పముగా గేయభాగములును, విశేషముగా నృత్యమును, కలవై యుండెను. అవి సింగి, సింగడు అను పాత్రములు కలవై యుండెను. వీరిద్దరే కథాపాత్రములగుచుందురు. మూడవవాడు కోణంగి విదూషక స్థానీయుడు. సంస్కృత ధ్రువాగానమే కురువంజులలో దురు వనబడెను. నృత్యదృశ్యములు తర్వాత జక్కులవారు నగరములందు ప్రయోగింప జొచ్చిరి. సింగి సింగడు మారి రామనల సీతాది పాత్రలు వచ్చినవి. కాని వీనిలో ఆటవికరచనా సంస్కార సూచకముగా "ఎరుకతసాని" పాత్రము వెలసినది. జాతరలలో యక్ష గంధర్వాది వేషముల ధరించి వేశ్యలు ప్రదర్శించినవి కావునను నృత్య ధర్మము లధికముగా గలవి కావునను నివి యక్షగానము లనబడెను. కళావంతులలో నొక తెగకు నేడు జక్కులవారను పేరు కలదు. అప్పకవి యక్షగాన లక్షణాలు తెలిపినాడు. దానినిబట్టి చూడగా యక్షగానమందలి ప్రధాన గేయరచనములు రగడలో కొంత మార్పు జరిపి త్రిపుట జంపె ఏక అట అను తాళముల కనుగుణముగా కల్పింపబడినవి. ఏలలు జోలలు సువ్వాలలు ధవళములు వెన్నెల పదములు విరాళి తుమ్మెద గొబ్బి కోవెలపదములు ద్విపద త్రిపద చౌపద షట్పద మంబరులు మొదలగునవి యక్షగానాలలో చేరినవి. విజయనగర మధుర తంజావూరు రాజ్యాలలో యక్షగానములు మిక్కిలి ప్రబలెను. కృష్ణాతీరమందలి కూచిపూడి గ్రామమున సిద్ధేంద్రుడను యోగి యొకడు భాగవత కథలను, పారిజాతము, గొల్లకలాపము, మొదలగు పేళ్ళతో యక్షగానములుగా రచించి, శాస్త్రీయముగా ఆయూరి బ్రాహ్మణుల చేతనే ప్రదర్శనము చేయింప నేర్పాటు చేసెను. ఇంచుమించుగా తెనుగున 500 దాక లెక్కింపదగిన యక్షగానములలో సుగ్రీవవిజయ మొక ప్రశస్త కృతి రుద్రకవి క్రీ.శ. 1568 ప్రాంతమువాడు."

సుగ్రీవ విజయములో త్రిపుట, అర్థచంద్రికలు, ద్విపద, జంపె, కురుచ జంపె, ఆటతాళము, ధవళములు, ఏలలు అనునవి వాడినారు. నాలుగు తేట గీతలు, రెండు సీసములు, ఒక ఉత్పలమాల, ఒక కందము ఇందలి పద్యాలు. ఇదే ప్రకరణములో శుకసప్తతిలో ఎరుకలదానిని కొరవంజియని రనియు, అది తన మగడు "సింగడు" అని చెప్పుటయు సూచించినాను. యక్ష గధర్వ శబ్దాలు గానప్రాధాన్యమునకు వాడుదురు. యక్షగానము గంధర్వగానము అనునవి ప్రసిద్ధమైనవి. ఇప్పుడిప్పుడు పరదాలు సంస్కృతాంగ్ల నాటకపద్దతులు వచ్చినవిగాని 40 ఏండ్లకు పూర్వమువరకు యక్షగానాలకే ప్రాధాన్యముండెను. నేటికిని తెలుగుదేశపు పల్లెలలో చెంచులక్ష్మీ నాటకము బెడుదూరి హరిశ్చంద్ర నాట