పుట:Andrulasangikach025988mbp.pdf/318

ఈ పుట ఆమోదించబడ్డది

కరణాలు......కమ్మర, చాకల, మంగళ, కుమ్మర, అగసాల, తలార్లు, దేవళ్ళ పెద్ద దెవినడు, చిన్న దెవినడు (వింత పర్లు గమనించాడు.) మాదిగె, నాగపాగా తీమ్మపాగా (ఈ పేర్లునూ గమనించుదు), బేగారి, వీరు బారా బలవంతులు.

మాన్యాల నిర్ణయం:- బాలవిశ్వేశ్వరుడు అనాదీయుములైన విగ్రహములు గనుక తళిగె దీపారాధనకు మాన్యం యిచ్చినది నల్తుము బైరవేశ్వరునికి తూమెడు నిరస.

శివాలయ లింగానకు తూమెడు నిరస హనుమంతరాయనికి అయిదు తూములు, పోతరాజునకు తూమెడు యిరస దేవమాన్యంలు సరి, రెడ్డి మాన్యం-కరణాలు, తలార్లు, కమ్మర, వడ్ల, చాకల, మంగల, కుమ్మర, జంగం, తమ్మళ, దాసరి, మెరగౌళ్లు (ఇదేమి జాతియో)? నేశెగవుళ్ళు ఒక్కొక్కరి కింత అని నిర్ణయం చేసినారు) యీ ప్రకారం మాన్యాలు కాపులకు 5 యేళ్లు కవులు చెల్లిన తర్వాతను తూము 1కి అయిదు వరహాలు యేర్పాటు చేసినారము.'

రాయల కాలమునుండి నేటివరకు పన్నిద్ద రాయగాండ్లు స్థిరపడి క్రీ.శ. 1600 నుండి ఈ క్రింది వారుపన్నిద్ద రాయగాండ్లుగా లెక్కింపబడిరి. (1) కరణము, (2) రెడ్డి, (3) తలారి, (4) చాకలి, (5) మాదిగ (తనము చేయువాడు), (6) మంగలి, (7) వడ్ల, (8) కమసలి, (9) పురోహితుడు, (10) నేరడి, (చెరువులుండు గ్రామాలలో) (11) కుమ్మరి, (12) కమ్మరి, ఈ లెక్కలో తర్వాత మరికొంత మార్పు కలిగెను. ఇప్పుడు కమసలి, పురోహితుడు ఆయగాండ్లలో చేరరు. రెడ్డి కరణాలకు తలార్లకు జీతాలు, స్కేళ్లు ఏర్పడినవి. కాన వారును ఈ పట్టికనుండి తొలగినారు. ఇప్పుడు నికరముగా మిగిలినవారు చాకలి, మంగలి, వడ్ల, కమ్మరి, చెరువు లుండుచోట నేరడి, మాదిగ, కొన్ని తావులలో కుమ్మరి. పూర్వము నుండియు కరణము లెక్కలు వ్రాసేవాడు.

              "గంటము ఖడ్గము తోడుత
               నంటున పగ దీర్పవలయు నవసరమైనన్."

అన్న వరుస వారు కరణాలు. కత్తులకు గంటములనే వారెదురొడ్డి పలుమారు గెలిచినవారు. 'రెడ్డధికారియైన గ్రామరైతుల జెరచున్‌' అన్న సూక్తిని స్థిరపరచినవారు రెడ్లు.