పుట:Andrulasangikach025988mbp.pdf/297

ఈ పుట ఆమోదించబడ్డది

నవి. అందుచేతనే కవులు బంటు పేద, బంటుపైద అని జంటగా వాడిరి. అత్తోపు, ఆ తోపు అని యర్థమేమో ? పారిగోడ అన మట్టిగోడ కాదు. ప్రహరిగోడ అనియే యర్థము చేయవలెను. అయ్యలరాజు నారాయణ కవి "గొప్ప ప్రహరిగోడ" అని శుకసప్తతికారున "గొప్ప పారిగోడ" అన్నదానికి మారుగా వ్రాసెను. గార అన గచ్చు.)

బీదబ్రాహ్మణులు కొందరిట్లు జీవించిరి:-

సంతలో పత్తి బిచ్చము తెచ్చి జందెములు వడికి, మర్రియాకులు తెచ్చి, విస్తళ్ళు కుట్టి, కూరగాయలు పండించి, అంగళ్ళముందు జారిన మిరియా లేరి, నీటి నన్నింటిని విక్రయించి దనము సంపాదించెడివారు.[1] అట్టి లుబ్ధుల కుమారులు సాధారణముగా దుష్టు లగుదురు. ఆ లుబ్ధుని కుమారుడు, జోగి జంగాలని చూస్తే మండిపడి లంజమందుల కుదారముగా నిచ్చి "తముకువేసిన వెన్క దా జరించిన బట్టి యునుపకుండ దలార్లకొసగి యొసగి", "దర్పకాకార దాతలరాయ యని వెంటబడు బట్టువారికి పారవైచి" పీటమర్ద విట చేత విదూషకులకే పసదనము లిచ్చి, "లొల్లగాడయ్యె నవ్వి ప్రవల్లభుండు"[2], పూర్వము గ్రామాలలో చీకటి వడగానే తప్పెట వేసి ఊరివాకిండ్లు మూసి అచ్చట తలార్లు కావలి యుండెడివారు. తప్పెట వేసిన తరువాత బయట సంచరించువారు చోరులో, జారులో యగుదురు. కాన వారిని పట్టి ఠాణాలలో తెల్లవారువర కుంచి తలార్ల పెద్దవద్ద విచారింపజేసి శిక్షించెడివారు.

రెడ్డి సంసారము:-

          "కొలుచు సమగ్రభంగి నొనగూడ దివాణపువారి చేతి కా
           కలు హుసి వోవగా కరవు కాల మెరుంగక, పూసబొట్టులం
           బలి కలినీళ్ళు చందనపు మానికె గొల్చిన మాళ్ళు గల్గి శో
           భిలుదురు రెడ్డిబిడ్డలు కుబేరుని పిల్ల లనంగ నచ్చటన్.[3]

(దివాణమువారు=రాజు కొలువుకూటమువారు, హుసిపోవుట=అధిక మగుట. ఈ పదము నిఘంటువులలో లేదు.) ప్రభుత్వానికి వ్యవసాయకులు ధాన్యరూపముగా వన్నిచ్చిరని యిందు సూచింతము. చందనపుమానికె చంద

  1. శుకసప్తతి. 4-109.
  2. శుకసప్తతి. 4-111.
  3. శుకసప్తతి. 2-406.