పుట:Andrulasangikach025988mbp.pdf/295

ఈ పుట ఆమోదించబడ్డది

బోగముసాని:-

"హిజారు (లాగు) మీద తొట్రిలువడి నొంటికట్టున ఘటించిన చీర సగంబు మూపుపై నలవడ బోటిదట్టి" గట్టెడివారు. వారికి "తిరుమంజనము" (దేవునిస్నానము) వేళలందు దేవాలయములందు సేవలో నుండుటకై ఏర్పాటుండెను. మరియు దేవునికి కొడుమెత్తునప్పుడు (నిండు కుండను తీసుకొని పోవునప్పుడు) కూడా వెంట నుండవలెను.

          "కొడుమెత్తుకొరకు గుడికిన్ నడచున్
           వెలపడుచు, నాభినామమునుం, గ్రొ
           మ్మడి సౌరున్ మడిచారున్ వడి
           జారుం బైట వింతవగ గన్పింపన్.[1]

మాస్టీడు (శూరభటుడు):-

"తలపాగ పొరమీద జెలగెడు నాయుధార్చన సల్పినట్టి దాసనపుపూవు." ఎడమకేల గొలుసును, కుడికేల పెద్దపత్తి, దట్టితో చెక్కునిద్దావంకి (కత్తి) దుప్పటివల్లెవాటు, ముందరి బిరుదడవిణ కలవాడు.[2]

ప్రజా జీవనము

బ్రాహ్మణుల యిండ్లు, వారి జీవన మెట్లుండెనో కొంత తెలియ వస్తున్నది.

          "అలికి మ్రుగ్గులు పెట్టినట్టి తిన్నెలు,
              కంచు బోరుతల్పులు, పాలుపోసి చాల
           యూర్చవచ్చుననంగ నొసర చావడి-
              తాళువారంబు, చిన్నగవాక్ష మలరు
           వంటకొట్టము, చిలువాన మించిన మిద్దె,
              పట్టెమంచముతోడి పడుకటిల్లు
           పడసార ముంగిలి నందిరి, పసిగాడి,
              కాయధాన్యములున్న కణజములును,

  1. శుక. 3-17.
  2. శుక. 3 అ-58.