పుట:Andrulasangikach025988mbp.pdf/290

ఈ పుట ఆమోదించబడ్డది

బట్టిన నాగపడిగకోల" కాసెకట్టిగా కట్టిన చెంగావిచీర, నీలిరవిక, కాళ్ళకు గజ్జెలు కట్టి పరశురామునిపాట పాడుకొనుచు ఎక్కలోజోగు అని బిచ్చమెత్తునట్టిది[1] (దర్శనపు దండ నిఘంటువులలో లేదు. గవ్వల దండయని యర్థము.)

తురక జవాను:-

           మెలిపెట్టి చుట్టిన తెలిపరంగిముడాసుపై
                లపేటాడబ్బు పనుల జెలగు
           బంగారువ్రాతల పట్టుహిజారు కంబరు
                చీనినిమతాని పాడు నొసలు
           తనుకాంతి గనుపింప దనరు నంగీజోడు
                వలిపెంపు శాలువ వల్లెవాటు
           వడుదలలోస డాబాకత్తి వదలు పాపో
                సులు గోరంట బొలుచుగోళ్ళు

           నడుము సీలున్న తోలుడాల్ బెడగుసూప
           అభయముగ వెంట నరుదెంచు నభరువాడు

           అమరు ముస్తెదు తేజితో నరుగుదెంచె
                దారుణాకారుడైన యుద్దారుడొకడు.
           వచ్చియయ్యూరి వెలుపల రచ్చ రావి
                క్రేవ దుర్వారుడై "తలారికి బులావు
           ధగిడికే" యను మాటకు తలకి రెడ్డి
                తోడివారలతో చేనిత్రోవ బట్టె" [2]

(పై పద్యములో కొన్ని పదాలకు నిఘంటువులలో అర్థాలులేవు. చుంగు పాగాను మెలికలు వడచుట్టినాడు. తెలి ఫరంగి ముడాసు అనగా ఫరంగీ (ఫ్రెంచి) వారివద్ద కొన్న తెల్ల టోపి. ఫరంగీవా రమ్మిన తెల్లని నెత్తి టోపీ (ముడాసు) పై లపేటా (షమ్లా, చుంగుపాగా) చుట్టినాడు. జరీ అంచులుకల పట్టీలాగు

  1. శుకసప్తతి. 2-425.
  2. శుకసప్తతి. 4-27-28.