పుట:Andrulasangikach025988mbp.pdf/286

ఈ పుట ఆమోదించబడ్డది

తప్పువొప్పు దండనఖండన పదుపావాడం మొదలయిన దేశసమాచారసహా తమకు సమర్పిస్తిమి" (పెమ్మసాని తిమ్మానాయడు-గండికోట ముట్టడి యను లఘుపుస్తకమునుండి).

క్రీ.శ. 1652 లో గోలకొండ మంత్రియగు మీర్ జుమ్లా గండికోటను మోసము చేసి పోర్చుగీసుల సహాయముతో ఆక్రమించుకొని కోటలోని విగ్రహాలను తెప్పించి 20 ఫిరంగీలు చేయుమని మైలే అను బుడతకీచు వానికి చెప్పినాడు. వాడు 48 పౌనులవి 10 ఫిరంగీలు, 24 పౌనులవి 10 ఫిరంగీలు కావలెనన్నాడు. రాగి విగ్రహాలను కరిగించినారు. అన్నీ కరిగినవి మూసలో. మాధవస్వామి మూర్తులు మిగిలియుండెను. వాటిని మూసలోవేసి ఎంత ప్రయత్నించినా కరగలేదు. ఇందులో బ్రాహ్మణులమంత్ర ముందని అర్చకులను బాధించిరి. లాభము లేకపోయెను. ఫిరంగి యొక్కటికూడా సిద్ధము కాలేదు. టావర్నియర్ అనువాడు తానీ సంఘటనను స్వయముగా చూచి తన (Travels in India) గ్రంథములో నిట్లు వ్రాసెను.

"The Nawab (Mir Jumla) collected a quantity of idols from the Pagodas" Amonaga these, there were Six of Copper, there ofa which were 10 ft. high. It was impossible for Maille to melt these six, no matter how much the Nawab expended. In short, Maille never accomplished making a single Cannon."

(గండికోటముట్టడి అను లఘు పుస్తకములనుండి ఉద్ధృతము. కర్తపే రందులేదు. "ఈ వ్యాసము సమదర్శిని అంగీరస సంచిక కోసము ఉద్దేశింపబడింది" అవి అందు కలదు.)

జనుల వేషాలు

జనులకట్టులో, బొట్టులో, అలంకరణములలో వైవిధ్యముండెను. నన్నూరు ఏండ్లక్రిందట మనయాంద్రులలో వివిధవృత్తులవారు, కులములవారు ఎట్లుండిరో ఇంచుమించు చిత్తరువుపటాలవలె మనకు తనవర్ణనలతో చూపిన ప్రతిభాశాలి పాలవేకరి కదిరీపతి. ఒక్కొక్కజాతి మనిషిని, స్త్రీని, చక్కగా వర్ణించి మనయెదుట నిలబెట్టినాడు. అట్టిపద్యములన్నియు నుదహరింప యోగ్యమైనవి. కాని అటులచేసిన గ్రంథము పెరుగును. కావున ముఖ్యమైనవి కొన్ని యుదహరించి తక్కిన వానిని సూచింతును.