పుట:Andrulasangikach025988mbp.pdf/278

ఈ పుట ఆమోదించబడ్డది

తెలిపినాము. వారికి ప్రధానముగా శివాలయములందు పూజారితన ముండెను. తంబళిపదమున కేమర్థమో తెలియరాలేదు. వారు దేవాలయములకు విస్తళ్లు ప్రతిదినము తెచ్చి యిచ్చువారు. "తిరుమల దేవరాయల కాలములోని ఒకశాసనమునుబట్టి వాటికి ఆదెప్పనాయనింగారి కార్యకర్త అయిన సూరపరాజు గోరంట్లలోని సోమేశ్వరదేవాలయమునకు విస్తళ్లు తంబళివా రిచ్చుకొనుటను ప్రార్థనపై విలుపుదలచేసి అందుకుమారుగా దేవాలయమును బాగుచేయునట్లు శాసించినవి తెలియ వస్తున్నది[1]."

వైష్ణవాలయములు కట్టించునప్పుడు "విష్ణుప్రతిమోత్సవము" చేసెడివారు. (శివాలయములకును అట్లే చేసిరి.) శ్రీవైష్ణవులు ద్వాదశ పుండ్రకదారులై శ్రీచూర్ణరేఖలు దిద్ది "తిరుమణి వడముల" తో "తిరుపగూడల"తో "చెర్వముల"తో ఆ యుత్సవానికి వేంచేసిరి. తిరుమణి వడము=తామరపూసలదండ. తిరుపగూడ=నామాల సాధనములు కల తాటాకు బుట్ట. చెర్వము=చరువ=పాత్ర[2] వైష్ణవమత ప్రచారమును వైష్ణవకవులుకూడా చేసిరి. సాంబోపాఖ్యానము వ్రాసిన రామరాజు రంగప్ప ఇట్లు వ్రాసెను. "సిద్ధాంతదర్పణుండను గురుడు హస్తినాపురికి పోయి భీష్మద్రోణ విదురాదులను పంచసంస్కార సంస్కృతులను గావించి శరణాగత ధర్మంబుల భాగవతవాత్సల్యంబును తెలిపి, హరికథా శ్రవణము కావించి, అష్టవిధ భక్తి ప్రకారంబును, నవవిధభక్తి యుక్తులను తిరువారాధనా మర్యాదలను ఆదిగాగల పరమవైష్ణవ సిద్దాంతంబు బుద్ధి గోచరంబున జేయుచుండె." [3]

వైష్ణవాలయములలో పూజారులు "తాతలతరంబు నాటినుంటి యాశ్రయించి జీవిస్తూవుండిరి. నైవేద్యములను వారే అనుభవించెడివారు. భక్తులిచ్చిన దీపారాధనపు నూనెను వీలుకొలది తీసుకొనెడివారు. భక్తులిచ్చు దక్షిణలవల్ల మంచి లాభము పొందిరి.

"విను మేము ప్రాలుమాలిన దీవె సుడిగాక, కినిసిన రెండు గుగ్గిళ్లుగాక తక్కిన నింత గ్రంథప్రసాదముగాక, మనపైన నొక వడతునక గాక యట

  1. Salatore. II
  2. సాంబోపాఖ్యానము. 4-147.
  3. సాంబోపాఖ్యానము. 4-152.