పుట:Andrulasangikach025988mbp.pdf/247

ఈ పుట ఆమోదించబడ్డది

రెడ్డిరాజ్యకాలములోని దొంగలలక్షణాలను చూచినాము. విజయనగర రాజ్యకాల కవులును ఇంచుమిం చవే లక్షణాలను వర్ణించి వారు, తాళ్ళపాక చిన్నన్న యిట్లువ్రాసెను.

         'చేయమ్ము, ఎకవారు చెప్పులు, రాగి చాయలు దేరు నచ్చపు నీలిదట్టి
          మొలవంకియను .... .... ఇనుము, కన్నపుగత్తి, యెడ దట్టిలోన
          పొసగిన దివ్వార్పు బ్రువ్వులకోవి తలముళ్ళు, చొక్కు, నిద్దపుదద్దగోరు
          బలపంబు, బదనికల్, బంతి కత్తెరయు,[1]

మున్నగు సాధనములతో దొంగలు దొంగతనాలు చేసిరి. పూర్వప్రకరణమున త్రాడు, వంకికొండియు దొంగల పరికరాలలో చేరినట్లును వంక ఇనుపకొండి త్రాట గట్టి గవాక్షములద్వారా వస్తువుల చేదుకొనుటకై యుండునని వ్రాసియుంటిని. అదే యుపయోగమును చిన్నన్న యిట్లు తెలిపినాడు. ఒకదొంగ యింటిలోనికి దిగి,

         'గురు హేమబింబంబు గొలుసునం గట్టి కదలింప నా సన్న గని మీది
          వారలది యందుకొని యంత నతని గ్రమ్మరను అల గొలుసున తొంటి
          యట్ల నెన్నడును బలసి చేరుకొనంగ....' [2]

దొంగల దోపిడివిధానమును (టెక్నిక్) రాయలు విపులముగ సమగ్రముగా వ్రాసినారు. ఒక బ్రాహ్మణుడు తనభార్య యూరికి శిష్యునితోను కొత్త కోకలు రూకలసంచితోను పయనమయ్యెను. ప్రయాణముచేయువా రొక్కరొక్కరుగా పోకుండిరి. కాన యితరబాటసార్ల పయనము చూచుకొని అతడు పయనమయ్యెను. ఒక దొంగ యతని వెంట తానును ఒక బాటసారివలె సిద్ధమయ్యెను. రాత్రి పథికులు ప్రయాణము చేయక మజిలీలలోని సత్రాలలో దిగెడివారు. తెల్లవారకముందు వారు లేచి ఉత్తరదిక్కు ప్రయాణమైరి. వారిలో పథికుడుగా చేరిన దొంగ ముందే తనవారి కీసంగతి తెలిపి వారిని దారికాచుటకు పంపెను. సాతు (బాటసారులగుంపు) ప్రయాణము చేయుచుండగా దొంగ తనకు బాగా తెలిసినట్లుగా బాట చూపువాడై వారి నొక యడవిలోనికి తప్పించి ఒక సెలయేరు రాగానే ఈల వేసెను. ఈల దొంగల సంకేతము. వాగులు, వంకలు, కనుమలు,

  1. ప. యో. విలాసము. పు 485
  2. ప. యో. విలాసము. పు 526