పుట:Andrulasangikach025988mbp.pdf/236

ఈ పుట ఆమోదించబడ్డది

కొలదిరేఖలు వడి కోసినయట్టి యెలమించి వలకేలి యినుపకమ్ములను చేరువ నిలిచిరి?[1]

వారిపను లెట్టివనగా:-

      చప్పటి కుముదంబు చదరపానంబు కప్పుచూరలు, కంబకాళ్లు పద్మకము
      ఒగి మహాజగతియు, ఉపజగతియును మొదలయిన తమ పని....."[2]

ఈ పదములో చదరపానము అన చదురమైన పానవట్టమనియు కప్పుచూరు లన ఇంటికప్పు ముంగలి భాగము లనియు, పద్మక మన దేవాలయ గోపురముల అడుగు భాగములో తీర్చెడి పద్మదళము లనియు అర్థము చేసి కొందురు. కప్పుచూరులు తప్ప తక్కిన పై పద్యములోని పదములన్నియు శ. ఋఅ. నిఘంటువులో లేవు. మహాజగతి, ఉపజగతి, పద్మక పదములు శబ్దకల్పద్రుమమందును లేవు. వాస్తు శాస్త్రములం దివి లభించు నేమో ?

మాలదాసరి వేష మెట్టిదనగా:-

చమురు తగిలిన తోలు కుప్పసము, టెక్కి అనగ టోపియును, ఇత్తడితో చేయబడిన ఒక శంఖపు ఒక చక్రపు ఆకారముగల కుండలములు, జింక కొమ్ముల అలుగులు, తోలుతిత్తి మొగిలియాకు గొడుగు, గుర్రపు వెంట్రుకతో నమర్చిన దండె (కిన్నెర) యు, చిటితాళములు, చంకబుట్ట, తులసిపేరులు నామాలు మున్నగు పరికరములు కలవాడై యుండెను.[3] అతడు వాయించు కిన్నెరను "చాండాలిక" అనిరి.

ఆ కాలమున వెట్టివా రుండిరి. "వెట్టివాని కేల విమలవిచారంబు?" "వెట్టివానికి కూలి వేడ దగదు" అని యొక కవి అనెను.[4] "ఇల దొమ్మరిది జాతిహీనత యెంచదు" "పూటకూళ్ళది పుణ్యమునకు జొరదు"[5] అని యున్నందున దొమ్మరివారిని హీనులనుగా చూచిరి.

  1. ప. యో. విలాసము. పు 538.
  2. ప. యో. విలాసము. పు 540
  3. ఆముక్తమాల్యద 6 - 6.
  4. వెంకటేశ శతకము, తాళ్ళపాక పెదతిరుమలయ్య.
  5. వెంకటేశ శతకము, తాళ్ళపాక పెదతిరుమలయ్య.