పుట:Andrulasangikach025988mbp.pdf/229

ఈ పుట ఆమోదించబడ్డది

ఈ సందర్బమ లో రడ్టి అని రాయలు ప్రయోగించినారు. రాష్ట్రకూట, రట్టకుడి, రడ్డిఅని రూపాలు మారుతూ తుదకు క్రీ.శ. 1650 నుండి రెడ్డి పదమే స్థిరపడెను.

         "ఎడ్డెతనపు కై సేతల రడ్డులు పురస్సరద్బార్యముగా"

అని యతిస్థానములో తెనాలి రామకృష్ణుడును, "రాజౌనొ, రడ్టియౌనొ" అని చేమకూర వేంకటపతియు వాడిరి. రడ్డీ పదప్రయోగము చేమకూరదే తుదిది. అటుతర్వాత రెడ్డిరూపమే నిలిచినది.

రెడ్లు వ్యవసాయమును ప్రధాన కులవిద్యగా చేసుకొనిరి. "వారికి తెనుగు దేశములో మంచి పలుకుబడి యుండెను. పంట మైలారు రెడ్డి చాలా ప్రసిద్ధుడు, వారు దూర దూర ప్రాంతాలకు వలసపోయిరి. అందుచేతనే యిప్పటికిని వారు తిరుచునాపల్లి, కోయంబత్తూరు, సేలం జిల్లాలలో నున్నారు."[1]

"రామయభాస్కరుడు అను బ్రాహ్మణుడు శ్రీ కృష్ణదేవ రాయల పక్షమున కొండవీటికి వెళ్ళి గోపీనాథస్వామి దేవాలయమును పునర్నిర్మాణము చేసి కొండవీటి రెడ్డిరాజ వంశమువారిని అచ్చటికి దేవుని దర్శింప నాహ్వానించి ఒక రొకరిని అంతరాళికము లోనికి తీసుకొనిపోయి తలలు గొట్టించెను. అటుతర్వాత రాయలు సులభముగా కొండవీటిని ఆక్రమించుకొనెను."[2] ఇదే విషయమును గూర్చిన ఇట్టి యైతిహ్యము కలదని కొంద రాంధ్రులుకూడ వ్రాసిరి.

         అయితే యిందెంత సత్యమున్నదో నమ్ముటకు వీలులేదు.

ఆనాటి వ్యవసాయమును గూర్చి బార్బోసా యిట్లు వ్రాసెను. "జనులు కనరా దేశములో వరి యలుకుదురు. జడిగెములుకట్టి గొఱ్ఱుతో విత్తుదురు. బయలు మెట్టుపొలాలలో విత్తనాలు చల్లి పాయుదురు." నూరేండ్ల క్రిందట నుండిన సర్ తామస్ రో అను ఇంగ్లీషువాడు రాయల సీమలో చెరువులనుగూర్చి యిట్లు వ్రాసెను. "ఈప్రాంతాలలో క్రొత్త చెరువులు కట్టుటకు ప్రయత్నించుట వ్యర్థప్రయత్నము. అనువైన ప్రతిస్థలములో కూడ పూర్వము చెరువులు కట్టి

  1. Salatore, II. 37.
  2. Salatore, II. 133 - 4