పుట:Andrulasangikach025988mbp.pdf/215

ఈ పుట ఆమోదించబడ్డది

ఇతరధాన్యాలు సమృద్ధిగా నున్నవి. ఇవి చాలా చౌకగా లభించును. ఒకటిన్నర అణాకు మూడుకోళ్లు నగరములోను, నాలుగు పల్లెలలోను లభించును. ఒకటిన్నర అణాకు 12 లేక 14 పావురాలు దొరకును. ఒక పణము (8 అణాలు) ఇచ్చిన పచ్చి ద్రాక్ష మూడుగుత్తు లిత్తురు. ఒక పణమునకు పది దానిమ్మపండ్లు దొరకును. ఒక వరహాకు నగరములో 12 మేకలు, గ్రామములో 15 మేకలు దొరకును. ఒక భటుడు తన గుర్రమును ఒక దాసిని నెలకు నాలుగైదు వరహాలలో భరించగలడు." (అనగా 20 లేక 25 రూపాయలు.)

మిరియాలకు సుంకము తీసుకొనెడివారు. ఆ కాలములో మిరియాలకు చాలా (రవానా) గిరాకి (గ్రాహకము) ఉండెను. మిరపకాయ లింకను దక్షిణ అమెరికానుండి మన దేశములో ప్రవేశపెట్టి యుండలేదు. మిరపకాయ లను పదము మిరియము అను శబ్దమునుండి మిరియపు కాయ అని యేర్పడినది. అది క్రీ.శ. 1600 తర్వాతనే మనదేశమందు నెగడెను. అంతకు పూర్వము కారానికి మిరియాలే వాడిరి. మిరియాలు మళయాళ దేశమందు సమృద్ధిగా పండును. తూర్పు దీవులందును అవి సమృద్ధి. వ్యాపారులు వాటి నక్కడినుండి తెప్పించి తెనుగు దేశమందమ్మిరి. వాటివలన వచ్చు సుంకము వలన ప్రభుత్వానికి గొప్ప ఆదాయ ముండును.

"ఒకవైశ్యు డుత్తముడు మిర్యముల పెరికలు త్రోవగా పెక్కు గొంపోవ గని యవి యేటి వెక్కడి కేగుచున్న వనుచు చౌరంగి తన్నడిగిన వాడు సుంకరి యను భీతి స్రుక్కి నేర్పునను బొంకి తప్పించుక పోద మటంచు నవి జొన్నలనుటయు నట్లుగా నాత్మ దనిలి తలంప చిత్రముగా నా పెరిక లందలి మిరియంబు లవి జొన్నలయ్యె."

-నవనాథ. పుట 99.

ఆ కాలములో జొన్నలకు సుంకము లేకుండెనని పై పంక్తులను బట్టి యూహింప వచ్చును.

కోమట్లు వ్యాపారపు మరుగుమాటల నాడుదురు. మద్రాసులో బేరగాండ్లిరువురు చేతులుకలిపి పైన సెల్లా కప్పి ఒకరి అరచేతిలో ఒకరు ధర వ్రాసి తెలుపుకొందురు. పూర్వము కూడా "కోమటిబాస" యుండెను