పుట:Andrulasangikach025988mbp.pdf/210

ఈ పుట ఆమోదించబడ్డది

కాని మనము పూర్వనాణెములు దొరకిన అవి చెల్లవని వాటిని కరగించి యుపయోగించుకొందుము. మన చారిత్రక పరిశోధకులందరు ప్రత్యేకముగా నాణెముల పరీక్షను బాగా చేసినవారరుదై యున్నారు. తెనుగుదేశములో చాళుక్య, కాకతీయ, రెడ్డిరాజ్య విజయనగర సామ్రాజ్య కాలములలోను, గోలకొండ రాజ్యములోను నుండిన నాణెములను సచిత్రముగా, సమగ్రముగా, ప్రత్యేకముగా బయలుదేరిరి. యవసరము.

వ్యాపారము

కాకతీయుల కాలములోకన్న రెడ్డిరాజుల కాలములో దేశీ విదేశీ వ్యాపారము వృద్ధిపొందియుండెను. విజయనగర రాజుల కాలములో వ్యాపారము మరింత వృద్ధి నొందెను. హిందూస్థానమందు పాడి కామ ధేనువులు, ధన కల్ప వృక్షములు (Pagoda Trees) కలవని యూరోపు ఖండములో మూలమూల లందు మార్ర్మోగి పోయెను. హిందూస్థానమునకు బోయి "పగోడా చెట్లను" ఉర్రూతలూపి రాలిన ధనరాసులను ఓడలలో నింపుకొని పోదమని అచ్చటి సాహసికులు నాహుకారులు, మేలయిన తుపాకుల మెడలపై వేసుకొని ఓడలలో బయలుదేరిరి. అయితే వారికి హిందూస్థానమున కెట్లుపోవలెనో సముద్రముపై దారి తెలియకుండెను. స్పెయిన్, పోర్చుగల్ దేశాలవారు ఒకరికంటే ఒకరు ముందుగా ప్రయాణము కట్టిరి. స్పెయిన్ వారు సముద్రముపై కొలంబస్ నాయకత్వములో పోయిపోయి తుదకు అమెరికా ఖండ తీరమందలి దీవులను చేరిరి. అదే హిందూస్థాన మనుకొనిరి. కాని తరువాత పొరపాటును గుర్తెరిగి ఆదీవుల జనులకు మొదటిపే రేముండెనోకాని వారుమాత్రము ఎర్ర ఇండియనులు అను నూతన నామ మిచ్చిరి. పోర్చుగల్ వారు వాస్కోడగామా అనువాని నాయకత్వములో ఆఫ్రికా ఖండమును చుట్టుకొని తుదకు హిందూస్థాన పశ్చిమతీరమందు చేరిరి. వారు శ్రీకృష్ణదేవరాయల కాలములోపలనే మన దేశమందు ప్రత్యక్షమై విజయనగర సామ్రాజ్యములో వ్యాపారము చేసిరి.

అరబ్బు దేశము ఎడారి భాగము. అందుచేత అరబ్బులు జీవించదలచిన వ్యాపారముచేతనే జీవించవలసి యుండెను. వారు బహు ప్రాచీనమునుండి హిందూస్థానముతో వ్యాపారము చేసిరి. అత్యంత సన్నిహితవందుండిన ఈరా (లేక పారసీక) దేశము హిందూస్థానముతోనే యెక్కువ వ్యాపారము చేసెనున్