పుట:Andrulasangikach025988mbp.pdf/155

ఈ పుట ఆమోదించబడ్డది

స్త్రీలు గర్బవతు లైనప్పుడు:

      "మూడునెలల ముద్దవెట్టిరి యలరు కుడుము లైదు నెలల బెట్టి
       రేడునెలల మొక్కి రెర్రపోలమ్మకు సతికి చూలువెళ్ళ జరుపుకొనుచు,
      "ఇంతిమది దలకుచు నెడమప్రక్క నిదిగొ మెదలెననుచు జెప్ప సుదతులంత
       చంటి జిగురుగోర సంధించి చిరజీవి యైన సుతుడుపుట్టె ననగ పొంగు"

కుమారుడు పుట్టినప్పుడు:

      "నిసువుబొడ్డుమీద పసిడిటంకం బిడి యొయ్య నాభినాళ ముత్తరించి
       ముత్తియముల జేటముంచి యందిడు కనుదమ్ములందు సమ్మదము నిగుడ."
      "కలి దోచి నూనె వ్రే లిడి తలపుర్రియయందు నేతి తైలంబును, జొ
       త్తిలరించి మెత్తగా బొదు గలరించి కుమారునునిచి రా దాదు లటన్.

      "క్రమమున దాదు లక్కడను ముప్పటిలిన జలకంబుదేర్చి యాచెలువసుతుని
       కొనరగ కాటుకయును చుక్క బొట్టును పాటించి యా గడపకు వెలుపట
       పొదికిళ్ళ తవుడు నిప్పులు ప్రత్తిగింజలు నిడి యడ్డముగ చిట్టు పడిసివైచి
       వేపరెమ్మలు నీళ్ళపెసలలోపల నించి కాపులు పురిటింట గట్టిచేసి
       వాయనముల కెల్ల వనితల రప్పించి వారుదెచ్చినయవి వరుసనంది
       పచ్చకప్పురంపు బలుకులు వెట్టి విడియము లిచ్చి రింపు నయముగలుగ."[1]

పెండ్లి సమయములో జరిపెడి యాచారములు శ్రీనాథుడు యిట్లువర్ణించెను.

      "వేడ్క నృత్యంబు లాడిరి వీధులందు పాడి రెత్తిలి పిక కుహూ పంచమమున
       పంజళంబున ధవళ ప్రబంధ గీతకమల నవ్వేళ కర్ణాట కమలముఖులు."

ఈ పద్యములో ఎత్తిలి అన గట్టిగా అని శబ్దరత్నాకరములో వ్రాసినారు. ఎత్తిలి అనునది ఒక విధమగు దేశీగాన మని తోస్తున్నది పంజళము అనగా పాంచాలీ గీతికా విశేషము. ధవళము అనగా పెండ్లిండ్లలో పాడు పాటలు ధవళాలకు సువ్వాలకు అప్పకవి కూడా లక్షణాలు వ్రాసినాడు. నేటికిని కొన్ని యిండ్లలో ధవళాలు పాడుతారు. ఇంకా ఏమి చేసిరనగా:-

  1. సింహాసనద్వాత్రింశిక. భా 1. పు 59, 60.