పుట:Andrulasangikach025988mbp.pdf/144

ఈ పుట ఆమోదించబడ్డది

కుల్లాయిశబ్దము ఫార్సీ కులహ్ శబ్దమునుండి వచ్చినట్లున్నది. ఫార్సీలో కులహ్ అనగా టోపి. మన వాఙ్మయములో టోపి యనునది భట్టుమూర్తి కాలమునుండి అనగా విజయనగర పతనానంతరము వచ్చినట్లు కానవచ్చును. టొప్పికాయను పదమును మొదట వాడినవాడు చాళుక్య సోమేశ్వరుడు. రాజులకు టోపీని ధరించుట ముఖ్యమని అతడు అభిలషితార్థ చింతామణిలో వ్రాసెను.

వెలమరాజుల యాస్థానమునకు పోవుటకుకూడా దర్బారీ వేషము వేసుకొనుట యవసరమై యుండెను. ఒకమారు (బహుశా మొదటితడవ) కోలాచలం మల్లినాథసూరి సర్వజ్ఞ సింగభూపాలుని దర్శనార్థమై వెళ్ళెను. రాజుగారి కొలువు కూటమునకు (దర్బారు) వేషములేక వచ్చెనని కంచుకి లోనికి పోనీయలేదు. అప్పుడు మల్లినాథు డిట్లనెనట.

         "కిం దారుణా వంకరటింకరేణ
          కిం వాసనా చీకిరిబాకిరేణ
          సర్వజ్ఞ భూపాల విలోకనార్థం
          వైదుష్య మేకం విదుషాం సహాయ:"

ఆ మాటను అదే కోలాచల (కొలమచెలమ) వంశమువాడగు పెద్దిభట్టు అన్నాడని శృంగార శ్రీనాథములో వ్రాసినారు. గోలకొండ వ్యాపారులను నియోగిశాఖవారు గోలకొండ రాజ్యములో (తెలంగాణములో) ఏర్పడిరి. వారి వేషభాషలను గూర్చి శ్రీనాథు డిట్లనెను.

         "దస్త్రాలున్ మసిబుర్రలున్ కలములున్
          దార్కొన్న చింతంబళుల్
          పుస్తుల్ గారెడి దుస్తులున్ చెమట కం
          పుం గొట్టు నీర్కావులున్
          అస్తవ్యస్తపు కన్నడంబును భయం
          బై తోచు గడ్డంబులున్
          వస్తూ చూస్తిమి రోస్తిమిన్ పడమటన్
          వ్యాపారులన్ క్రూరులన్."

దస్త్రము అనునది ఫార్సీ దప్తర్ అనుపదము. నిన్న మొన్నటి వరకు తెలంగాణములో మూరెడు బొంగు లొట్టలో గలుగు దంటుకలాలు పెట్టి అ