పుట:Andrulasangikach025988mbp.pdf/107

ఈ పుట ఆమోదించబడ్డది

శకునములు పాటించుట, ఒక ప్రయాణమునకేకాక శిరస్స్నానమునకు ఆయుష్కర్మ అను ముద్దుపేరుగల క్షౌరమునకు, నూతన గృహప్రవేశములకు, విత్తనమునకు, కోతలకు నిత్యజీవనములోని అసంఖ్యాకాల్పవిషయాలకు దినశుద్ధి చూచుకొనుటను మనుస్మృత్యాదులందును పురాణాలలోను వ్రాయుటయు, మనము వాటిని పెంచి పట్టుగా పాటించుటయు, అనాదిసిద్ధమై మాయని పరిపాటియై పోయినది.

ప్రయాణాదులకు దినశుద్ధి యిప్పటికిని చూచుకొనువారే బహుళము ఆకాలమందు.

ఇక, రెడ్డిరాజులకాలమందలి కులములను గూర్చి విచారింతము. రెడ్లు "చతుర్థజాతి" వారై యుండిరి. కాకతీయులు "అత్యర్కేందుకులప్రసూతులు." వీరిని స్పష్టంగా శుద్రులని చెప్పజాలకపోయిరి. అయినను క్షత్రియోచితకర్మలను యజ్ఞయాగాదులను, సోమపానమును వీరు చేసిరి. పైగా క్షత్రియులము అని చెప్పుకొనువారితో నెల్లను బాందవ్యము చేసిరి. చోళులతో, విజయనగర చక్రవర్తులతో, పల్లవులతో, హైహయులతో, ఇతర రాజకులీనులతో బాంధవ్యములు చేసిరి. కాని వెలమలతో కాని, కమ్మలతో కాని బాంధవ్యము చేసినట్లు కానరాదు.

రాచవారు, చోడులు తాము క్షత్రియులమని చెప్పుకొనిరి. క్షత్రియులందరు సూర్యునికో చంద్రునికో పుట్టినవారట! సూర్యచంద్ర మండలాలకు పిల్లలుపుట్టరని మన కీనాడు బాగుగ తెలియును కాన సూర్యచంద్ర వంశాలనునవి కల్ల, బలిష్టులై దేశము నాక్రమించుకొని పాలించిన విజేతలపై పౌరాణికులకు అనుగ్రహము కలిగినపుడెల్లను వారిని చంద్రునికో సూర్యునికో అంటగట్టి క్షత్రియులనుగా జేసిరి. అనార్యులగు హూణహవివ్కకనిష్కాదులు, శకరాజులు, ఇట్టివారెందరో క్షత్రియులైరి.

"చోడులు క్షత్రియులుగదా! వారితో రెడ్లను కలుపుట యెట్లని కొందరకుసంశయము కలుగవచ్చును. కాని, క్షత్రియులమని చెప్పుకొన్న చోడులు ప్రాచీనకాలమునుండి క్షాత్రవృత్తి వహించిన వారగుటచేత నుత్కృష్టమైన రాజపదవులను వహించినప్పుడు ఆ కాలమునాటి బ్రాహ్మణోత్తములు వారిని క్షత్రియులనుగా పరిగణించి యుందురు. కాని యిటీవలి రెడ్డిరాజులు పూర్వపు వర్ణాశ్రమసాంప్రదాయ ధర్మములు చెడిపో