ఈ పుట ఆమోదించబడ్డది

నాగయరుద్రదేవుడు వారల నెదుర్కొని కొంతవఱకు బోరాడి దురదృష్టవశమున శత్రువులచే జిక్కెను. మహమ్మదుషాహ పట్టణదుర్గమునకు ముందు నగ్ని --------- కోట గోడనుండి యతని నందు బడద్రోయింపగా నతడు వీరమరణంబు నొందెను గాని యాదారుణకృత్యమును గనియు వినియు సహింపజాలక యాంధ్రవీరు లొక్కుమ్మడి యారౌతులపై బడి కఠోరకుఠారంబుల జేతికినందినవారినట్లే నఱకు చుండుట జూచి యాతురుష్కసైనికులు భీతిల్లి పలాయనులు కాగా దెలుగురౌతులు వారిని విడిచిపెట్టక వెంబడించి తఱుమగా మహమ్మదుషాహ గూడ దెబ్బతిని గాయమునొందినవాడై పరాజితుడై తుదకు బదునేనువందల సైనికులతో బాఱిపోయి కలుబరగి చేరి తిరిగి చూచెను.

అనపోతానాయడు గోల్కోండను గోల్పోవుట

బహమనీరాజ్యము ప్రక్కలోబల్లెమువలె నుండుట చేత అనపోతనాయడు డిల్లీ చక్రవర్తిగ నున్నఫిరోజిషాకడకు రాయబారులను బంపి తాను వానికి సామంతుడుగ నుండి కప్పము గట్టుచుందుననియు, బహమనీరాజ్యమును వానిరాష్ట్రములో జేర్చుకొమ్మనియును, తమకు సహాయముగా గోంతసైన్యమును బంపినయెడల నాకార్యమును తాము సాధింప గలమ