ఈ పుట ఆమోదించబడ్డది

వారలకు వీనిని జయించుట కష్టసాధ్యముగా నుండెను. ఇట్లుండ నాకనాడు రాచవా రీసింగమనాయని బావమఱది యగు చింతలపల్లి సింగమనాయని బట్టుకొనిపోయి జల్లిపల్లి కోటలో చెఱలో బెట్టగా నీతడు విని బహుసైన్యముల గూర్చుకొనిపోయి జల్లిపల్లికోటను ముట్టడించెను.

సింగమనాయడు సంహరింపబడుట

అప్పుడు దుర్గములో నున్న రాచవా రీతనితో దలంపడి పోరాడుటకు సాహసింపజాలక మాయోపాయంబున నీతని గడతేర్పవలయు నని తమలో దాము నిశ్చయముచేసికొని మహామాయావి యగు తమ్మళ బ్రహ్మాజీయను వానిని రప్పించి మోసపువితముగా సింగమనాయని జంపుమని బోధించిరట! అతండును వల్లెయని యొకనాడు సింగభూపతిని స్నేహభావమును సూచింపుచు సమీపించి యాకస్మికముగా గపటోపాయమున నాతని బాకుతో బొడిచి పాఱిపోయెనట! అంతట సింగమనాయడు తన పుత్త్రులను రప్పించి "పుత్రకులారా! నా శత్రువులు నన్ను యుద్ధమున గెలువలేక కపటోపాయమున బొడిపించిరి. నేనిక బ్రతకను. దీనికి మీరు చింతించిన బ్రయోజనము లేదు. నన్ను బొడిపించిన శత్రురాజులరక్తముతో దిల తర్పణము గావించి నా ఋణము"