ఈ పుట ఆమోదించబడ్డది

నుత్తరపుటొడ్డున నున్న యానెగొందిదుర్గమునుండి తత్సమీపదేశమును బరిపాలనము సేయుచుండెను. ఇతఁడు బహఉద్దీనునకు రక్షణ యొసంగె నను సమాచారములను చారులవలన విని చక్రవర్తి కోపోద్దీపితుడై 1334 వ సంవత్సరమున దండయాత్ర వెడలి వచ్చెను. అసంఖ్యాకములగు సైన్యములతో దనపై దండెత్తివచ్చియున్న చక్రవర్తిని కంపిలికోట సమీపమున జంబుకేశ్వరుడెదిరించెను. ఆంధ్రకర్ణాటులకును డిల్లీ తురుష్కులకును మఱియొకమాఱు ఘోరయుద్ధము జరిగెను. ఈ యుద్ధము తనకుఁ బ్రతికూలముగ పర్యవసితమగునేనియూహించి తురుష్కులవలన స్వకుటుంబమునకు మానభంగుమగునేమో యన్నభయముతో తన స్త్రీల నెల్లర నగ్నిప్రవేశమగునట్లు చేసి రాజు శత్రువుల మార్కొని పౌరుషముతో ప్రాణములున్నంతదనుక పెనంగి తుదకు వీరస్వర్గమునే చూడగలిగెను. ఆనెగొందిదుర్గము తురుష్కుల వశమయ్యెను. డిల్లీ చక్రవర్తి చేతికి బహఉద్దీను మాత్రమేగాక మఱియార్గురు మంత్రివర్గమువారు చిక్కిరఁట. వీరిలో జంబుకేశ్వరమంత్రియగు హరిహరరాజును కోశాధ్యక్షుఁడగు బుక్కరాజుకూడ నుండిరఁట! తక్కిన నలువురు జంబుకేశ్వరుని సర్దారులట. వీరి కోరిక ననుసరించి రాయలశవ మానెగొదికిఁ గొనిపోఁబడి యాతనియౌర్ధ్వదేహిక క్రియలు చక్కగా నిర్వర్తింపఁ