ఈ పుట ఆమోదించబడ్డది

కునై నే నీమూడవభాగమును విజ్ఞానచంద్రికామండలి కిచ్చి యుండ లేదని మాత్రము విశదపఱచుకొనుచున్నాడను. ఇందులకు విజ్ఞానచంద్రికామండలియు, మహాజనులు నన్ను క్షమింతురుగాక! గ్రంథము వెల్వడుటయె ప్రథానము గాని ప్రకాశకు లెవ్వరైన నేమి?

మన దేశములో బట్టపరీక్షలం దేఱిన విద్యాధికు లెందఱో యున్నను, కొందఱు మాత్రమె స్వభాషాభిమానులై భాషాసేవ జేయుటకు గృషిచేయుచున్నను దేశచరిత్రము విషయమై యుపేక్షాపరులైయుండుటయు, దేశచరిత్ర మెఱుంగక జనసామాన్య మజ్ఞానదశయం దుండుటయు దలపోసి నాశక్తి కొలది నే నీలోపమును నివారింపబూని యీచరిత్ర రచనకు దొరకొన సాహసించి క్రమముగా జరిత్రమును బ్రచురింప నారంభించినతోడనే దేశమున గొంతకదలిక జనింప నారంభించినది. నా కీమహత్కార్యమున దోడ్పడదగిన విద్యాధికులలో నొక్కరగు శ్రీయుతజయంతి రామయ్య బి. ఏ. బి. ఎల్ గారు ప్రతిపక్షకోటిలో జేరినవా రైరి. సమగ్రము సప్రమాణమునగు జరిత్రము కావలయు ననియు నందు కొక పరిషత్తేర్పడవలయు ననియు నుద్ఘోషించిరి. అటు వెనుక వారు చేసిన ప్రయత్నములు ఫలించి కొందఱు మహారాజుల ద్రవ్యసహాయమునను విద్యాధికుల ప్రోత్సాహము