పుట:Andhrula Charitramu Part 2.pdf/81

ఈ పుట ఆమోదించబడ్డది

బగు నిక్కమండ్రు, మడియడె
యగునని యిడి తొల్లి టెంకణాదిత్యుడనిన్“

ఇది కారణమైనను గాకపోయినను ఇతడు యుద్ధములో మరణముగాంచెననుమాట వాస్తవమనుటకు సందియములేదు. ఇతడొకప్పుడు రాజ్యముచేసెనని చెప్పుదురు. అందుచేతనే కాబోలు దన కుమారసంభవమున నీ కవి :

“క. పురుషుడు పురుషున కని న
స్థిర జీవిత లోభయుతమతిని వినమితుడై,
స్మరకలహకుపిత బ్రాణే
శ్వరి నాయుధ సమితి దెలచువాడటు మీదన్.“

“ఉ. మంచిగ బ్రీతిబాయక సమస్తజనంబులు దన్నుగొల్వజీ
వించిన ధన్యుడౌ మహిమ వీడిన జీవము మేననిల్ప నా
సించి విభుండు దానొకట సేవకుడై మనుకంటె ముందరా
ర్జించిన కీర్తి నిల్వ గతిసేకురగా ననిచావు సేగియే.“

అని వ్రాసికొనియున్నాడు. ఇతడు రచించిన కుమారసంభవము పదిరెండాశ్వాసముల గ్రంథము. ఇది కాళిదాసు కావ్యమునకు దెలుగుకాదని చెప్పబడినది. దీనిలో గణపతిజననము, సతీదహనము, మదనదహనము, పార్వతీ వివాహము, కుమారోదయము, తారకాసురయుద్ధము, తరాజయమును వర్ణింపబడినవి. ఈ కవిరాజశిఖామణి కావ్యములో వర్ణనలత్యద్భుతములై నూతనములై యున్నవనియు, ఏతత్కృతి చాల బ్రాచీనమైనను సకలకావ్య లక్షణములకు బుట్టినిల్లగుటచేత నప్పుడు మెరుగిచ్చితీర్చిన చిత్రమువలె మనోరంజకముగా నున్నదనియు, రాజ కవులలోను గవిరాజులలోను నిట్టివాడు లేడనుటయంత యతిశయోక్తిగాదనియు దద్గ్రంథమును సంపాదించి ప్రక